పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 విశ్వాసులు జ్ఞానస్నానం పొందిన పిదప పాపాలు చేయకపోతే పాపోచ్చారణం అవసరమే లేదు. జ్ఞానస్నానమొక్కటే సరిపోయేది. కాని నరులు బలహీనపు ప్రాణులు. పిడికెడు మట్టిముద్ద నుండి పుట్టినవాళ్ళు. మన బలహీనతలు ఆ ప్రభువుకి కూడ తెలుసు - కీర్త 103,14. అతడు కరుణా సముద్రుడు కూడ - ఎఫె 2,4. కనుక అతడు జ్ఞానస్నానం తర్వాత పాపాలు కట్టుకొని పిశాచానికి దాసులయ్యేవాళ్ళనుద్దేశించి ఓ ప్రత్యేక సంస్కారాన్ని నెలకొల్పాడు. అదే పాపోచ్చారణం. ఈ పుణ్యక్రియలో ప్రభువు సిలువమరణం మనవిూద సోకి మన పాపాలు పరిహారమౌతాయి. కనుక ఈ సంస్కారానికి మనం దేవునికి సదా కృతజ్ఞలమై యుండాలి.

3 ఒక భక్తుడు ఈలా చెప్పాడు. మనం పాపం చేసేప్పడు పిశాచం మనలను ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహం వలన మనం సిగూసెరము లేకుండ కానిపనులు చేస్తాం. కాని అదే పిశాచం మనం పాపోచ్చారణం చేసేపుడు సిగ్గును పట్టిస్తుంది. ఈలాంటి పాపాలను మనలాగే నరుడైన గురువుకి ఏలా చెప్తాం అనే సంకోచాన్ని కల్గిస్తుంది. కనుక భక్తుడైనవాడు పిశాచం ప్రోత్సహించినపుడు పాపాలు చేయనూకూడదు, పిశాచం నిరుత్సాహ పరచినప్పడు పాపాలు ఒప్పకోవడం మాననూ కూడదు.

4 యెహెజ్కేలు ప్రవచనంలో ప్రభువు "నేను పాపి నాశం కావాలని కోరుకోను. అతడు పరివర్తనం చెంది మళ్లా బ్రతకాలని నా కోరిక" అంటాడు - 33, 11. ఇది చాల గొప్ప వాక్యం. బైబులు భగవంతుడు స్వయంగా జీవమయుడు. మనకు కూడ జీవాన్ని దయచేసేవాడు. కాని పాపం ద్వారా మనం ఈ జీవాన్ని చంపుకొంటాం. పరివర్తనం చెందినపుడు మళ్లా ఈ జీవం మనలో నెలకొంటుంది. కనుక పరివర్తనం ద్వారా మనం దేవుని జీవాన్ని పొందుతూండాలి.

2. పాపం

పాపమంత ఘరోరమైంది మరొకటి లేదు. మనకృషి అంతా కూడ పాపాన్నుండి విముక్తి పొందడానికే. కనుక పాపాన్ని గూర్చి మనకు స్పష్టమైన భావాలు వుండాలి. ఇక్కడ నాలుగంశాలను ప్రస్తావిద్దాం.

1. పాపాన్ని గూర్చిన బైబులు బోధలు

1. మొదట పూర్వవేద భావాలను పరిశీలిద్దాం. బైబులు బోధల ప్రకారంపాపమంటే ప్రధానంగా దేవుణ్ణి ధిక్కరించడం. అతనిమిూద తిరుగుబాటు చేయడం, దేవుడు