పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంచి చెడ్డలు ఎరిగించే చెట్టు పండ్లు తినవద్దన్నా తిన్నాడు ఆదాము. అనగా అతడు తన మంచి చెడ్డలను తానే నిర్ణయించుకోగోరాడు. దేవునికి లొంగి వుండటానికీ, అతనిమిూద ఆధారపడి జీవించటానికీ నిరాకరించాడు. తాను కేవలం సృష్టిప్రాణి ఐకూడ సృష్టికర్తను ధిక్కరించాడు. ఆ దేవాధి దేవునిముందు తన స్వాతంత్ర్యాన్ని చాటుకోబోయాడు. తానూ దేవుడంతటివాడు కావాలనుకొన్నాడు - ఆది 3,5. అందుకే దేవుడు అతన్ని అంత నిశితంగా శిక్షించింది. బైబులు ప్రారంభంలో ఆదికాండం వర్ణించే ఈ యాదాము పాపం కేవలం అతని పాపం మాత్రమే కాదు. అతడు మన కందరికీ శిరస్సు, అతని తప్ప మనందరి పాపాలకీ సంకేతంగా వుంటుంది. మనంచేసే ప్రతిపాపంలో కూడ దేవుణ్ణి ధిక్కరిస్తాం. అతనిమిూద తిరుగుబాటు చేస్తాం. కుండ తన్ను చేసిన కుమ్మరి విూద ఎదురు తిరిగినట్లుగా దేవునిమిూద ఎదురు తిరుగుతాం - యొష 29, 16, 2.

2 దేవుడు యిస్రాయేలీయులతో ప్రేమతో నిబంధనం చేసికొన్నాడు. ఈ నిబంధనం ప్రకారం ప్రభువు ఆ జనులకు దేవుడయ్యాడు. వాళ్లు అతన్ని కొల్చే భక్త సమాజమయ్యారు. పాపమనేది ఈ నిబంధనానికి వ్యతిరేకంగా పోతుంది. ఆ దేవునికి మాటయిచ్చి విూరినట్లవుతుంది. ఈ భావాన్ని స్పష్టం చేయడానికి బైబులు రకరకాల ఉపమానాలు వాడుతుంది. నిబంధనం ద్వారా యావే ప్రభువు భర్తలాంటివాడయితే యిస్రాయేలీయులు అతని వధువులాంటివాళ్ళు అయ్యారు. కాని పాపం ద్వారా యిస్రాయేలీయులు భర్తకు ద్రోహం చేసి వ్యభిచారం చేసిన భార్యలాంటివాళ్ళు అయ్యారు - యెహెజ్కేలు 16,23–26. ఇంకా నిబంధనం ద్వారా యూవే ప్రభువు ఓ తండ్రిలాంటివాడయితే యిస్రాయేలు ప్రజలు అతని కుమారునిలాంటివాళ్ళయ్యారు. కాని పాపంద్వారా యిస్రాయేలీయులు తండ్రిమాట వినని తనయుల్లాంటి వాళ్ళయ్యారు. ఎడూ గాడిదలే తమ యజమానుణ్ణి గుర్తిస్తాయి. కాని యిప్రాయేలీయులు దేవుణ్ణి గుర్తించడంలేదు - యోష 1.2-3.

3. పాపంవల్ల నరుల హృదయాలు మొదుబారతాయి. కండ్ల మసకలు కమ్ముతాయి. చెవులు విన్పించవు. అనగా నరుడు దేవుణ్ణి లక్ష్యం చేయడు - యెష 6,10. నరుల హృదయాలకు సున్నతి జరిగితేనేగాని వాళ్ళ పాపంనుండి వైదొలగరు. కనుకనే యిర్మియా ప్రవక్త యిస్రాయేలీయులు తమ హృదయాలకు సున్నతి చేయించుకోవాలని కోరాడు-9,25. పాపానికి ప్రాయశ్చిత్తం చేసికోవాలంటే ప్రజలు మళ్లా తండ్రివంటివాడైన దేవుని యొద్దకు మరలి రావాలి. ఈలా తిరిగి రావడమే పరివర్తనం.

4. యిప్రాయేలు పాపం వ్యక్తిగతమైంది మాత్రమే కాదు, సామూహికమైందికూడ ప్రభువు ప్రజలను వ్యక్తిగతంగాకాదు, ఒక జాతిగా ఎన్నుకొన్నాడు. వారి పాపంగూడ