పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యాజకత్వం ద్వారా క్రైస్తవ ప్రజలు ఇతర దేవద్రవ్యానుమానాలను పొందడానికి అర్హులౌతారు. గురువుతో కలసి పూజబలి నర్పిస్తారు. అప్పరసాలను క్రీస్తు శరీర రకాలుగా మార్చే శక్తిగురువకేవున్నా క్రైస్తవ ప్రజలు కూడ అతనితోకూడి యథార్థంగా పూజబలినర్పిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇంకా, ఈ యాజకత్వం ద్వారా వివాహం చేసుకొన్న స్త్రీ పురుషులు పరస్పరం వివాహ సంస్కారాన్ని ప్రసాదించుకొంటారు. జ్ఞానవివాహంలో భార్యాభర్తలే ఒకరికొకరు ఈ సంస్కారాన్ని ఇచ్చుకొంటారు. అక్కడ గురువు కేవలం సాక్షిమాత్రమే.

జ్ఞానస్నానం దివ్యసత్ప్రసాదానికి దారితీస్తుంది. దివ్య సత్ప్రసాదని పుచ్చుకొందే అది పూర్తికాదు. నీటినుండీ ఆత్మనుండీ జన్మిస్తేనేగాని నరుడు పరలోక రాజ్యంలో చేరడు. యోహా 3,5. కాని క్రీస్తుశరీరాన్ని భుజించి అతని రక్తాన్ని పానం జేస్తేనేగాని నరునికి జీవం లేదు - 6, 52. చిన్నబిడ్డ జ్ఞానస్నానంపొందినప్పడే దివ్యసత్ప్రసాదనికిగూడ ఉద్దేశింపబడ్డాడు అనుకోవాలి. పసిబిడ్డ పెద్దవాళ్ళ ఉద్దేశంవల్ల జ్ఞానస్నానం పొందుతాడని చెప్పాం, ఆ సమయంలోనే అతడు పెద్దవాళ్ళ కోరిక ద్వారానే, మానసికంగా దివ్యసత్ప్రసాదాన్ని కోరుకొంటాడు, పుచ్చుకొంటాడుగూడ, అనగా జ్ఞానస్నానం හිජ්රායී పసిబిడ్డ వస్తుతః దివ్యసత్రసాదాన్ని పుచ్చుకోకపోయినా దాని ఫలితాన్ని పొందుతాడు. ఇది వేదాంతియైన తోమాసు అక్వినాసు భక్తుని భావం. పూర్వం మన ల్యాటిసు శ్రీసభలో పసిబిడ్డకు జ్ఞానస్నానం పొందగానే దివ్యసత్రసాదం కూడ ఇచ్చేవారు. గ్రీకు శ్రీసభలో ఈ యాచారం ఇప్పటికీ వుంది.

-2) రాజత్వం, క్రీస్తు రాజు, ఆయన తండ్రిని గూర్చి బోధించి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. మనం ప్రేమభావంతో దేవుని చిత్తానికి లొంగినప్పడు ఆ దైవరాజ్యం మన హృదయంలో కూడ నెలకొంటుంది. ప్రతి క్రైస్తవుడు మొదట దైవరాజ్యాన్ని తన హృదయంలో నెలకొల్పడానికి గూడ కృషి చేయాలి.

క్రీస్తు మనకు రాజు అంటే ఆయన మనకు నాయకుడు అని భావం. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడు మనంకూడ ఈ నాయకత్వాన్ని పొందుతాం. గురువైతే ఆధ్యాత్మిక విషయాల్లో క్రైస్తవ సమాజానికి నాయకత్వం వహించడం ద్వారా ఈ గుణాన్ని క్రియాపూర్వకంగా ప్రదర్శిస్తాడు. గృహస్టులైతే భూమి మొదలైన ప్రకృతి శక్తులను వశంలోకి తెచ్చుకోవడం ద్వారా ఈ గుణాన్ని ప్రదర్శిస్తారు. ప్రభువు ఆది దంపతులతో మీరు భూమిని స్వాధీనం చేసుకొమ్మని చెప్పాడుకదా - అది 1, 28 అనగా గురువు ఆధ్యాత్మిక రంగంలోను, గృహస్థలు లౌకిక రంగంలోను కృషిచేస్తూ క్రీస్తు రాచరికంలో పాలుపొందుతారని భావం.