పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు యిప్రాయేలీయులతో నిబంధనం చేసికోవడానికి కారణం ఆ ప్రజల్లో ఏదో ప్రత్యేకమైన యోగ్యత వుందని కాదు. యూదుల గొప్పతనాన్ని ಬಜ್ಜಿ కాదు, తన మంచితనాన్నిబట్టే అతడు వాళ్లతో నిబంధనం చేసికొన్నాడు. తాను వాళ్లను ప్రేమించాడు కనుక వాళ్లను ఎన్నుకొన్నాడు అంతే - ద్వితీ 7,7-8.

ఇక్కడ ఓ విషయం గమనించాలి. పాస్మబలిలోను నిబంధన బలిలోను కూడ నెత్తురు ప్రధానం, యూదుల భావం ప్రకారం నెత్తురులో ప్రాణముంటుంది — లేవి 17,11. ద్వితీ 12,23. ఈ ప్రాణం దేవుని ప్రాణమే. కనుకనే యూదులు ఏదైనా జంతువును వధించినపుడు దాని నెత్తురు ముట్టుకొనేవాళ్ళకాదు. ఇక దేవుని ప్రాణంతో గూడిన యీ నెత్తురే దేవునికీ ప్రజలకీ ఐక్యత చేకూర్చి పెట్టింది. నూత్నవేదంలోని అంతిమ భోజనం ఈ సీనాయి నిబంధన బలిని తలపిస్తుంది.

2. అంత్యభోజన వర్ణనలు

మత్త 26, 26–29

మార్కు 14,22-25

లూకా 22,15-20

1 కొరి 11, 23-26

యెరూషలేములో పాస్మోత్సవం జరిగేపడే క్రీస్తు శిష్యులతో అంతిమ భోజనాన్ని భుజించాడు. అది గురువారం సాయంకాలం. అక్కడ దేవళంలో పాస్క గొర్రెపిల్లలను వధిస్తున్నారు. ఇక్కడ విూదిగదిలో క్రీస్తు శిష్యులతో కడపటి భోజనం భుజిస్తున్నాడు. ఆ సంఘటనకూ ఈ సంఘటనకూ చాల దగ్గరి సంబంధం వుంది.

యూదుల సంప్రదాయం ప్రకారం పాస్మబలిని యెరూషలేములో ప్రొద్దుక్రుంకాక ప్రారంభించేవాళ్ళు, కుటుంబ సభ్యులు కనీసం పదిమందైనా కలసి ఈ విందు భుజించేవాళ్ళ విందులో గొర్రెపిల్లనూ పొంగని రొట్టెలనూ సాపడేవాళ్ళ ద్రాక్షాసారాయాన్ని సేవించేవాళ్ళ విందు జరిగే పద్ధతి యిది. మొదట కుటుంబంలోని తండ్రి ద్రాక్షసారాయపు పాత్రను ఆశీర్వదించగా సభ్యులంతా దాన్ని త్రాగేవాళ్ళు అటుపిమ్మట స్తుతి కీర్తనలు (111-113) జపించేవాళ్ళ తరువాత చేదు దుంపలు తినేవాళ్ళు ఈ దుంపలు ఐగుప్తలో యూదులనుభవించిన బాధలకు చిహ్నం. తరువాత తండ్రి ద్రాక్షసారాయపు రెండవ పాత్రను ఆశీర్వదించి సభ్యులకందించేవాడు. తదనంతరం చేతులు కడుగుకొని గొర్రెపిల్ల మాంసాన్నీ పొంగని రొట్టెలనూ సాపడేవాళ్ళ తండ్రి ఈ రొట్టెలను త్రుంచి అందరికీ అందించేవాడు. కడన అతడు ద్రాక్షసారాయపు మూడవ పాత్రను దీవించి