పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్వారబంధాలకు పూసికొనేవాళ్లు, గొర్రెపిల్ల మాంసాన్ని మాత్రం వండుకొని భుజించేవాళ్లు, "పాస్క” గ్రీకు పదం. "పేసా” దానికి మూలమైన హీబ్రూ పదం. ఈ పదానికి దాటిపోవడమని అర్ధం. ఎవరు దాటిపోయారు? ప్రభువు దూత (ఈ దూత ప్రభువే) ఐగుపులోని యిస్రాయేలీయుల యిండ్లను దాటిపోయాడు. అనగా అతడు యిప్రాయేలీయుల గడపల విూద పూసిన గొర్రెపిల్ల నెత్తుటిని జూచి ఆ యిండ్లను దాటిపోయాడు. ఆ యిండ్లలోని ప్రజలకు ఏలాంటి హాని చేయలేదు. కాని అతడు అలాంటి నెత్తటి పూతలేని ఐగుప్తియుల ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళ తొలిచూలు మగపిల్లలను చంపివేసాడు - 12,13,27.

ఇంతవరకు పాస్కపండుగను గూర్చిన వివరాలను చూచాం. ఇక రెండవదియైన పులియని రొట్టెల పండుగను చూద్దాం - నిర్గ 12,15-20. ఇది కూడ మోషేకు ముందటి నుండే ప్రచారంలో వున్న పండుగ. ఈ ఉత్సవ సందర్భంలో మందల్లోని తొలిచూలు పిల్లలను దేవునికి బలియిచ్చేవాళ్లు, దీన్ని నీసాను నెల 15-21 వరకు జరుపుకొనేవాళ్ళ ఈ పండుగ కాలంలో క్రొత్తగా పండిన గోదుమలతో చేసిన పొంగని రొట్టెలను మాత్రమే తినేవాళ్ళు ఐగుప్త నిర్గమనం సమయంలో ఈ పండుగ కూడ పై పాస్క పండుగతో కలసిపోయింది. తర్వాత ఈ రెండిటినీ కలిపి పాస్క పండుగ అన్నారు.

యూదులు ఐగుప్న నుండి బయలుదేరక ముందటి రాత్రి గొర్రెపిల్లనూ పొంగని రొట్టెలనూ భుజించారు. అటుతరువాత ఈ సంఘటనం సాంవత్సరిక ఉత్సవమైంది. పాలస్తీనా దేశంలో స్థిరపడిన పిదప యూదులంతా, వాళ్ళ మాత్రమే, ఏటేట ఈ పాస్క ఉత్సవాన్ని జరుపుకొనేవాళ్లు - 12,43-49.

యూదుల సంప్రదాయంలో ఈ పాస్క ఒక బలి. దానిలో గొర్రెపిల్లను నైవేద్యంగా భుజించారు. ఈ బలి యూదుల దాస్యవిముక్తికీ, ఐగుప్త నిర్గమనానికీ చిహ్నం. అనగా అది ప్రభువు అనుగ్రహించిన రక్షణానికి చిహ్నం. ఇంకా అది భవిష్యత్తులో ఆ ప్రభువు తన ప్రతినిధియైన మెస్పియాద్వారా దయచేయబోయే రక్షణానికి గూడ సూచనం. ఈ పాస్మబలి నూత్నవేదంలోని అంతిమ భోజనాన్ని సూచిస్తుంది.

2. నిబంధన బలి : యిస్రాయేలీయులు దాస్య గృహమైన ఐగుప్త నుండి బయలుదేరి వచ్చాక మూడు నెలలకు సీనాయి కొండను చేరుకొన్నారు. ఇక్కడ ప్రభువు వాళ్ళతో నిబంధనం చేసికొన్నాడు - నిర్గ 244-11. ఈ నిబంధనం బలిరూపంలో జరిగింది. మోషే కోడె నెత్తుటిని తీసికొని పీఠం మీదా ప్రజల మీదా చిలకరించాడు. “ఇది ప్రభువు మీతో చేసికొనిన నిబంధనపు రక్తం" అని చెప్పాడు - 24,8. ఈ పీఠం దేవునికి చిహ్నం. యిప్రాయేలు ప్రజలు ఆ దేవుని దాసులు, భక్తులు. ఈ బలిలో నెత్తటి ద్వారా దేవునికీ ప్రజలకీ ఐక్యత సిద్ధించింది.