పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ భాగం – దివ్యసత్ర్పసాదం భోజనం

9. దివ్యసత్రసాదం మనలను ఉత్తాన క్రీస్తుతో ఐక్యపరుస్తుంది 50

10. దివ్యసత్రసాదం మనలను తోడి నరులతో ఐక్యపరుస్తుంది 57

...ప్రశ్నలు 64

... బైబులు ఆలోకనాలు 67

మొదటి భాగం – దివ్యసత్ర్పసాదం బలి

1. అంత్య భోజనం

"యేసు రొట్టెను తీసికొని ఆశీర్వదించి విరిచి శిష్యులకిచ్చి విూరు దీనిని తీసికొని భుజించండి. ఇది నా శరీరం అని చెప్పాడు - మత్త 26,26.

క్రీస్తు చనిపోకముందు శిష్యులతో గూడి అంతిమ భోజనాన్ని భుజించాడు. ఈ భోజనం అతని మరడోత్తానాలను సూచిస్తుంది. నేడు మనం సమర్పించే పూజబలిలో ఈ అంతిమభోజనాన్నీ దానిద్వారా సిలువమరణాన్నీ జ్ఞప్తికి తెచ్చుకొంటాం. కనుక మనం మొదట ఈ చరమ భోజనం భావాన్ని జాగ్రత్తగా అర్థం చేసికోవాలి. ఈ యధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దాం.

1. పాస్మబలి, నిబంధనబలి

పూర్వవేదంలోని పాస్క నిబంధన బలులు నూత్నవేదంలోని అంత్యభోజనానికి సంకేతాలు. కనుక మొదట ఈ రెండు బలులను పరిశీలించాలి.

1. పాస్మబలి : నిర్గమకాండం 12వ అధ్యాయం ఈ బలిని వర్ణిస్తుంది. పాస్క ఒక పండుగ గాదు, రెండు పండుగలు. అవి పాస్క పండుగ, పులియని రొట్టెల పండుగ. మొదట పాస్క పండుగను పరిశీలిద్దాం - నిర్ణ 12,1-14. ఇది మోషేకు పూర్వమే ప్రచారంలో వుండేది. ఈ పండుగలో గొర్రెపిల్లను బలిగా సమర్పించేవాళ్లు, దీని ద్వారా గొర్రెల మందలు వృద్ధిలోకి వస్తాయని ప్రాచీన ప్రజలు భావించారు. కాని మోషే కాలంలో ఈ ఉత్సవం భావం పూర్తిగా మారిపోయింది. ఇది ఐగుప్త నిర్గమనానికి చిహ్నమైంది.

ఈ పండుగను నీసాను నెల 14వ తారీఖున జరుపుకొనేవాళ్ళు కుటుంబ సభ్యులంతా దీనిలో పాల్గొనేవాళ్ళ యావే ప్రభువుకి ఓ గొర్రెపిల్లను బలిగా అర్పించేవాళ్ళ దాని ఎముకలను విరగగొట్టకూడదు. దాని నెత్తుటిని యూదులు తమ తలుపుల