పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభ్యులకందించేవాడు. ఈ మూడవ పాత్రను దీవించడం ముఖ్యమైన ఘట్టంగా యెంచేవాళ్ళు.

క్రీస్తు కూడ ఇంచుమించు ఇదే పద్ధతిలో అంత్యభోజనం భుజించి వుండాలి. ఈ భోజనాన్ని నూత్నవేదంలో మార్కు మత్తయి, లూకా, పౌలు వర్ణించారు. ఈ వర్ణనల్లో కొద్దిపాటి వ్యత్యాసాలు కన్పించినా ప్రాధానాంశాల్లో మాత్రం తేడా లేదు. (మీద ఉదహరించిన నాలు ఆలోకనాలను చూడండి)

పై నాలు ఆలోకనాలు పేర్కొనే నూత్నవేద వాక్యాలు పూర్వవేదంలోని మూడు సంఘటనలను గుర్తుకి తెస్తాయి.

1. సీనాయి నిబంధనంలో మోషే పీఠం మీదా ప్రజలమీదా కోడె నెత్తురు చిలకరించి "ఇది యావే మీతో చేసికొన్న నిబంధనపు రక్తం" అని పల్కాడు - నిర్గ 248. క్రీస్తుకూడ అంతిమ భోజన సమయంలో "ఇది నిబంధనపు నా రక్తం" అన్నాడు - మత్త 26,28. మార్కు 14, 24.

2. పూర్వవేదంలో యిర్మీయా ప్రవక్త క్రొత్త నిబంధనాన్ని గూర్చి చెప్పాడు. యూదులు పూర్వనిబంధనాన్ని పాటించడం మానివేసారు. కనుక ప్రభువు వాళ్ళతో విసిగిపోయాడు. అతడు తన ప్రజలతో క్రొత్త నిబంధనం చేసికొంటాడు. ఈ నిబంధనంలో దేవుని ఆజ్ఞలు రాతి పలకల మీద కాక, నరుల హృదయాల మీదనే వ్రాయబడతాయి - యిర్మీ 31,81-83. క్రీస్తు అంతిమ భోజనం ప్రవక్త పేర్కొన్న ఈ నూత్న నిబంధనమే లూకా 22,20.

3. యెషయా తన ప్రవచనంలో ఒక బాధామయ సేవకుని పేర్కొన్నాడు. ఇతడు ప్రజలకోసం బాధలనుభవించాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అతని మరణం ద్వారా మనకు పాపవిమోచనమూ జీవమూ లభించాయి - యెష 53, 11-12. ఇంకా ప్రభువు ఈ సేవకుని ద్వారా ప్రజలతో నిబంధనం చేసికొన్నాడు. ఈ భక్తుణ్ణి ప్రజలకు ఓ నిబంధనంగా నియమించాడు - 42,6. అంతిమ భోజనంలో క్రీస్తు ఈ బాధామయ సేవకునిద్వారా జరిగిన నిబంధనం తన నిబంధనాన్నే సూచిస్తుందని చెప్పాడు - 22,20. 1 కొరి 11, 25.

ఇక పై నల్లురు నూత్నవేద రచయితల్లో మత్తయి మార్కులు క్రీస్తు అంతిమ భోజనం సీనాయి నిబంధనాన్ని తలపిస్తుందని చెప్పారు. అక్కడ మోషే చిలకరించిన నెత్తటికీ ఇక్కడ క్రీస్తు చిందిన నెత్తుటికీ సామ్యం వుందని చెప్పారు. కనుకనే ఈ రచయితలు “ఇది నా నిబంధనపు రక్తం" అన్న వాక్యం పేర్కొన్నారు. ఈ రచయితల భావాల ప్రకారo