పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17. ప్రేషితరంగం 126
18. ఆత్మఫలాలు 129
19. ప్రభుని స్తుతించాలి 131
20. పెంతెకోస్తు భక్తురాలు మరియ 133
21. సాంఘిక న్యాయం 136
22. పెంతెకోస్తు భక్తిని నిలుపుకోవడం ఏలా? 139
23. జపం 143

1. పవిత్రాత్మ ఉద్యమం చరిత్ర

1. ప్రభువు తన అనుచరులకు ఆత్మను వాగ్దానం చేసాడు. దప్పిక కలవాళ్ళు తనవద్దకు వచ్చి దాహం తీర్చుకోవాలి అన్నాడు. తన్ను విశ్వసించినవాళ్ళ హృదయంలో నుండి జీవజలప్రవాహం పొంగి పారుతుంది అని చెప్పాడు. విశ్వాసులు తననుండి పొందే ఆత్మే ఈ జీవజలప్రవాహం - యోహా 7, 37-39. క్రీస్తు మోక్షారోహణ మౌతూ శిష్యులు ఈ యాత్మ కోసం కాచుకొని వుండాలని చెప్పాడు. వాళ్ళు తండ్రి వాగ్లానం కొరకు వేచివుండాలనీ ఆ యాత్మలోనికి జ్ఞానస్నానం పొందాలనీ ఆదేశించాడు - అచ 1, 4-5.

2. ఈలా క్రీస్తు వాగ్హానం చేసిన ఆత్మ శిష్యులమీదికి దిగివచ్చింది. పెంతెకోస్తు దినాన శిష్యులంతా కూడి ప్రార్థన చేస్తుండగా ఆత్మ గాలిలాగా నిప్పలాగా వాళ్ళమీదికి దిగి వచ్చింది. అచ 2, 1-4, పూర్వవేదంలోనే ప్రభువు యోవేలు ప్రవక్తద్వారా "అంత్యదినాల్లో మానవులందరిమీదా నా యాత్మను కుమ్మరిస్తాను" అని ప్రమాణం చేసాడు. ఆత్మ రాకడతో ఈ ప్రమాణం నెరవేరింది - 2, 17. అపోస్తలుల మీదికి లాగే యేసుని విశ్వసించిన యేరూషలేము పౌరులు మూడువేల మంది మీదికి గూడ ఆత్మ వేంచేసి వచ్చింది. - 2. 38. ఆలాగే క్రీస్తుని నమ్మిన సమరయుల మీదికీ (8,17) కొర్నేలి కుటుంబము మీదికీ (11,15) యొఫెసులోని స్నాపక యోహాను శిష్యుల మీదికి (19.6) ఆత్మ విజయంచేసింది. ఈలా ఆత్మ క్రీస్తుని నమ్మిన వాళ్లందరి మీదికీ వస్తూనేవుంటుంది. ఈలా రెండువేల యేండ్లు సాగిపోయాయి.

3. ఈ శతాబ్ద ప్రారంభంలో కొన్ని పెంతెకోస్తు సమాజాలు వ్యాప్తిలోకి వచ్చాయి. వీళ్ల విశేషంగా ప్రోటస్టెంటు క్రైస్తవులు. ప్రస్తుతం వీళ్ళ రెండుకోట్లదాకా వున్నారు, మన క్యాతలిక్ సమాజంలో జాన్ పోపుగారికి పరిశుద్దాత్మపట్ల చాలా భక్తి వుండేది. ఆ యాత్మ ప్రేరణంతోనే ఆయన రెండవ వాటికన్ మహాసభ ప్రారంభించాడు. ఈ సభ పరిశుద్ధాత్మ