పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాగిపోవడంలాంటిది. అనగా గాలి పడవనులాగ పరిశుద్ధాత్మే మనలను నడిపించుకొని పోతుంది. కృషి చేసేది ప్రధానంగా ఆయాత్మ బిడ్డ తల్లి చేతిని పట్టుకొని నడవడం పుణ్యాలను ఆచరించడంలాంటిది. ఆ తల్లే బిడ్డని ఎత్తి రొమ్ముమీద పెట్టుకొని నడచిపోవడం వరాలతో జీవించడం లాంటిది.

2. వరాల వర్గీకరణం

యెషయా ప్రవక్త మెస్సియాను గూర్చి చెపూ"ప్రభువు ఆత్మ అతనిమీద నిలుస్తుంది. ఆయాత్మజ్ఞానం వివేకం బలం సదుపదేశం తెలివి దైవభీతి పట్టించే ఆత్మ" అని నుడివాడు11, 2-3. ఇక్కడ హీబ్రూ బైబులు పేర్కొనే వరాలు ఆరే. కాని సెపవాజింత్ గ్రీకు అనువాదం ఈ వేద వాక్యాల్లో 'దైవభక్తి" అనే ఏడోవరం కూడ చేర్చింది, దీన్ని ఆధారంగా తీసికొని మూడవ శతాబ్దంనుండి క్రైస్తవ పారంపర్యం ఈ వరాలు ఏడు అని బోధిస్తూ వచ్చింది. ఈ సప్తవరాలద్వారా ఆత్మ మనలను వశం చేసికొంటుంది. మనం ఆ యాత్మని చెప్పచేతల్లో వుండి అతడు నడిపించినట్లుగా నడుస్తాం.

జ్ఞానంస్నానం ద్వారా మనం క్రీస్తులోనికీ క్రీస్తుశరీరమైన శ్రీసభలోనికి ఐక్యమౌతాం. కనుక ఆత్మ క్రీస్తుకొసగిన ఏడు వరాలు క్రీస్తునుండి మనకుకూడ సంక్రమిస్తాయి.

ఈ వరాల్లో తెలివి, విజ్ఞానం, వివేకం సదుపదేశం అనే నాలు బుద్ధిశక్తికి సంబంధించినవి. దైవభక్తి దృఢత్వం, దైవభీతి అనేవి చిత్తశక్తికి సంబంధించినవి. తెలివి, వివేకం, విజ్ఞానం అనేవి మనకు ప్రార్థనాశక్తిని దయచేస్తాయి. దైవభీతి, దైవభక్తి సదుపదేశం, దృఢత్వం అనేవి ఆయా సత్కార్యాలు చేయడానికి మనకు క్రియాశక్తిని దయచేస్తాయి. ఏడు వరాల్లోను శ్రేష్టమైంది విజ్ఞానం. అన్నిటికంటె తక్కువది దైవభీతి.

ఇక, ఈ యేడు వరాలకు ఆయా పుణ్యాలతో గూడ సంబంధం వుంది. ఇవి ఆయా పుణ్యాలమీద సోకి వాటిని పరిపూర్ణంచేస్తాయి. వరాలు నైతిక పుణ్యాలకంటె గొప్పవి. కాని దివ్యపుణ్యాలకంటె తక్కువవి. ఏయే వరాలకు ఏయే పుణ్యాలతో సంబంధం వుందో ఈ క్రింది పట్టిక సూచిస్తుంది.

వరం పుణ్యం
సదుపదేసం వివేకం
దైవభక్తి దైవారాధనం
ధృఢత్వం ధృఢత్వం
దైవభీతి మితత్వం,నమ్మకం
తెలివి,వివేకం విశ్వాసం
విజ్ఞానం ప్రేమ