పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. వివేకం

1. వివేకం అంటే ఏమిటి?

ఈ వరంద్వారా వేదసత్యాలను లోతుగా అర్థంచేసికొంటాం. మన బుద్ధి వేదసత్యాలను ఎప్పటికీ పూర్తిగా గ్రహించలేదు. ఐనా మనం వాటిని కొంతవరకు అర్థంచేసికోవచ్చు. అందుకు ఈ వరం తోడ్పడుతుంది.

2. ఈ వరం ఫలితాలు

ఈ వరంద్వారా వేదసత్యాలను క్షుణ్ణంగా గ్రహిస్తాం. తోమాసు అక్వినాసు భక్తుని భావాల ప్రకారం ఈ గ్రహించడమనేది ఆరు విధాలుగా వుంటుంది. 1. వెలుపలి గుణాల మాటన దాగివున్నదేవుణ్ణి గుర్తిస్తాం. దివ్యసత్ప్రసాదంలో అప్పం, రసం గుణాల మాటున క్రీస్తుదాగి వున్నాడు. కంటికి కన్పించకపోయినా అతడు సత్రసాదంలో వున్నాడని అర్థంచేసికొంటాం, నమ్ముతాం, ఆరాధిస్తాం.

2. మాటల్లో దాగివున్న గూడర్ధాన్ని గ్రహిస్తాం. ఆత్మ వేదగ్రంథ వాక్యాల్లో దాగివున్న గూఢభావాన్ని మనకు విదితం చేస్తుంది. క్రీస్తు ఎమ్మావు త్రోవలో శిష్యులకు దివ్యగ్రంథ వాక్యాల భావాన్ని వివరించి చెప్పాడు — లూకా 24, 25–27. బైబులు చదువుకొనేపుడు ఆత్మ మనకు కూడ దివ్యగ్రంథ మర్మాలను విశదీకరిస్తుంది. దీనివల్ల మనకు గొప్పభక్తి పడుతుంది.

3. దేవద్రవ్యానుమానాల్లోని సాంకేతికార్థాలను అర్థంచేసికొంటాం. మనం జ్ఞానంస్నానం పొందినపుడు క్రీస్తు మరడోత్థానాలు మనమీద సోకుతాయి. అతడు భౌతికంగా మరణించినట్లే మనంకూడ పాపానికి మరణిస్తాం. అతడు భౌతికంగా ఉత్థానమైనట్లే మనంకూడ నూత్నజీవితానికి ఉత్తానమౌతాం - రోమా 6,4 పై వరంద్వారా మనం ఈ మరణోత్తానాల సంకేతాలను నమ్మి క్రీస్తు వరప్రసాదాన్ని పొందుతాం.

4. వెలుపలి భౌతిక రూపంలో దాగివున్న ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తిస్తాం. నజరేతూరి వడ్రంగిలో సృష్టికర్త దాగి వున్నాడు. ఈ వరం ద్వారా నరరూపధారియైన క్రీస్తు నిజంగా దేవుడని గ్రహిస్తాం. 5. కారణంలో దాగివున్న కార్యాన్ని గుర్తిస్తాం, సిల్వమీద తెరువబడిన క్రీస్తుహృదయంలో తిరుసభా ఏడు దేవద్రవ్యానుమానాలూ దాగివున్నాయి. క్రీస్తు కల్వరిమీద చిందించిన నెత్తుటిలో మన పాపాలకు పరిహారమూ, దేవునితో మనకు సిద్ధించే