పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పునస్సమాధానమూ ఇమిడి వున్నాయి. ఈ వరం మనకు ఈలాంటి రహస్యాలను ఎన్నిటినైనా నేర్పుతుంది.

6. కార్యంనుండి కారణాన్ని గ్రహిస్తాం, సకాలంలో వాన కురిసింది, పంటలు బాగా పండాయి. కనుక ఆ వాన ప్రభువు ప్రాణిపోషణానురక్తిని సూచిస్తూంది. ఈ వరంద్వారా వానలో ప్రభువు కృపను గుర్తిస్తాం. ఇక్కడ వాన కార్యం, ప్రభువు కృప కారణం.

పై యుదాహరణలనుబట్టి ఈ వరం ప్రధానంగా 3必 సత్యాలకు సంబంధించినదని తెలిసికోవాలి. దీనిద్వారా మన విశ్వాసం బలపడుతుంది. మనకు దేవునిమీదా దైవసంబంధమైన కార్యాలమీదా గాఢమైన భక్తి కలుగుతుంది. ఈ వరం ప్రధానంగా వేదాంతులకూ, వేదబోధకులకూ, ఆధ్యాత్మిక గ్రంథ రచయితలకూ అవసరం.

8. దీన్ని సాధించడం ఏలా

ఈ వరాన్ని సాధించాలంటే మనకు నిశ్చలమైన విశ్వాసం వుండాలి. పండ్రెండవ శతాబ్దంలో జీవించిన ఆన్సెల్మ్ భక్తుడు గొప్ప వేదాంతి. అతడు వేదాంత విషయాలను చర్చించడానికి పూనుకొనేప్పడెల్లా ముందుగా విశ్వాస ప్రార్ధనం చేసేవాడు. విశ్వాసం సహాయంతో బుద్ధిశక్తిని వినియోగించి వేదసత్యాలను వివరించడానికి పూనుకొనేవాడు. విశ్వాసం సహాయంతో మనలోని బుద్ధిశక్తివేదసత్యాలను గ్రహిస్తుంది అనేది అతని సూత్రం.

కొందరు చాల తెలివైనవాళ్ళు వుంటారు. ఐనా వాళ్లు దేవుణ్ణి అట్టే పట్టించుకోరు. వేదసత్యాలను అంతగా నమ్మరు. వాళ్ళ హృదయంలో భక్తివిశ్వాసాలు వుండవు. మరికొందరికి తెలివితేటలు అట్టే వుండవు. ఐనా వాళ్లు దేవుణ్ణి మతసత్యాలనూ గాఢంగా నమ్ముతారు. చాల భక్తి కలిగి వుంటారు. ఈ వ్యత్యానం ఏలా వచ్చింది? తెలివైనవాళ్ళమీదకంటె తెలివి తక్కువవాళ్ళమీద ఈ వరం అధికంగా పనిచేయడంవల్లనే. ప్రభువేమన్నాడు? “తండ్రీ! విజ్ఞలకూ వివేకవంతులకూ పరలోక రహస్యాలను మరుగుపరచావు. పసిబిడ్డలకు వాటిని తెలియపరచావు. కనుక నిన్ను స్తుతిస్తున్నాను" అన్నాడు — మత్త 11,15. ఈ సత్యం నేడు మన జీవితంలో కూడ నెరవేరుతుంది.

మనం తరచుగా జ్ఞానోపదేశాన్నీ వేదసత్యాలనూ, బైబులు బోధలనూ కేవలం సిద్ధాంతాలుగా మాత్రమే నేర్చుకొంటాం. లెక్కలు, చరిత్ర, ਹo మొదలైన వాటివలె ఈ వేదవిషయాలుకూడ మనకు కేవలం కొన్ని విజ్ఞానాంశాలు మాత్రమే ఔతాయి. కాని వేదవిషయాలను ఈలా నేర్చుకొంటే లాభంలేదు. ఈ పద్ధతివల్ల భగవంతుడు అనుభవానికిరాడు. మన హృదయం మంచికి మారదు.