పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వవేదంలో యూదులు ప్రభువుని జూచి భయపడేవాళ్ళు. మోషే మండుతూవున్న పొదలో దేవుణ్ణి చూచి ఉత్తరీయంతో ముఖం కప్పకొన్నాడు – నిర్ణ 3,6. దేవుడు అతనితో ఏ నరుడైనాసరే నా ముఖం చూస్తే ఇక బ్రతకడు అని చెప్పాడు - నిర్గ 32, 20 ఏలియా హోరెబు కొండమీద దేవుడ్డి చూచి ఉత్తరీయంతో ముఖం కప్పకొన్నాడు – 1రాజు 19,13. యెషయా చూచిన దర్శనంలో దేవదూతలు ఆ పవిత్రుడైన ప్రభువువైపు తేరిపాడజూడలేక రెక్కలతో ముఖాలు కప్పేసుకున్నారు — యొష 6,2. మనకు కూడ ఈలాంటి భయం అవసరం.

ఇక్కడ ఓ అనుమానం కలుగవచ్చు. మనం యూదుల్లాగ దాస్యపు ఆత్మను పొందలేదు. దత్తపుత్రుల ఆత్మను పొందాం. ఆయాత్మ సహాయంతో నూత్నవేదంలో దేవుణ్ణి చనువుతో నాన్నా అని పిలుస్తాం - రోమా 8, 15, మరి ఆ దేవుణ్ణి చూచి భయపడ్డం దేనికి? అతనిపట్ల మనకు కావలసింది చొరవా చనువూకాని భయం కాదుగదా? నిజమే. మనం దేవునికి బానిసలంగాదు, బిడ్డలం. కాని బిడ్డలమైనా కూడ మన మెప్పడైనా పాపం కట్టుకోవచ్చు. ఫలితంగా మన దత్తపుత్రత్వాన్ని కోల్పోవచ్చు. అందుచేత మనకు ఈ దైవభయం అవసరం. మనం దత్తపుత్రులమని చెప్పిన పౌలే "భయంతో వణకుతూ మీ రక్షణకార్యాన్ని నిర్వహించుకొనండి" అని చెప్పాడు – ఫిలి 2,12. నిత్యజీవితంలో మనం ప్రవర్తించే తీరు యూదుల ప్రవర్తనకంటె మెరుగేమీ కాదు. అందుచేత ఆ యూదులకుమల్లె మనకు కూడ దైవభయం అవసరమే. ఒక వైపున దేవునిపట్ల భయమూ వుండాలి, మరోవైపున అతనిపట్ల చొరవా నమ్మకమూ కూడా వుండాలి.

2. ఈ వరంతో ఏమి యవసరం?

కొంతమంది దేవునిపట్ల చులకనగా మెలుగుతుంటారు. అమర్యాదగా ప్రవర్తిస్తారు. భక్తులకు ఈలాంటి ప్రవర్తనం ఎంత మాత్రం తగదు. తల్లిదండ్రులు తమపట్ల వినయవిధేయతలూ మేరమర్యాదలూ లేకుండా ప్రవర్తించే బిడ్డలను మెచ్చుకోరుగదా! దేవుడూ అంతే కనుక దైవభీతి అనేది అనవసరం కాదు.

పాపాంకురం మనలో నిత్యమూ వుంటూనే వుంటుంది. అది యొప్పదైనా చెట్టుగా ఎదగవచ్చు. కనుక మన పతన స్వభావాన్ని తలంచుకొని మనమే భయపడాలి, అబ్వాలోము తన్ననురాగంతో జూచే తండ్రి దావీదుమీద తిరగబడ్డాడు. అలాగే మనంకూడా యెప్పుడైనా పాపంద్వారా దేవునిమీద తిరగబడవచ్చు. ఫిలిప్ నేరి అనే భక్తుడు "ప్రభూ! నీవీ ఫిలిప్పని నమ్మ వద్దు. ఇతడు నీకెప్పడైనా ద్రోహం చేయగలడు సుమా!" అని ప్రార్ధించేవాడట. మనకు కూడ ఈ మనస్తత్వం, ఈ భయం అవసరం.