పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దైవభయం ఇంకోలాభాన్ని కూడ చేకూర్చి పెడుతుంది, ఒకోసారి మన క్రిందివారిపట్ల నిరంకుశంగా, నిర్ధయగా ప్రవర్తిస్తాం. వాళ్ళకు హానిచేయబోతాం. ఆలాంటప్పడు ఈ వరం మనలను హెచ్చరించి మనకు బుద్ధిచెప్తుంది.

3. ఈ వరాన్ని సాధించే మార్గం

భగవంతుడు మహావైభవం కలవాడు. మహాపవిత్రుడు, ఆలాంటి ప్రభుని అల్పప్రాణులమైన మనం పాపంద్వారా అవమానించగలం. అందుచేత మనం ఎప్పడుకూడ ఆ ప్రభుని చూచి భయపడతూండాలి. వళ్ళ దగ్గరబెట్టుకొని బ్రతుకుతూండాలి. కావుననే క్రీర్తన కారుడుకూడ “నీ భయంతో నావళ్ళు వణకిపోతూంది,నీ యాజ్ఞలకు నేను గడగళ్ళాడుతూన్నాను" అని వాకొన్నాడు - 119, 20, ఈ భయం మన హృదయంలో భక్తి మర్యాదలను పుట్టిస్తుంది. ఈ వినయభావాన్ని జూచి ప్రభువు మనలను ప్రీతితో ఆదరిస్తాడు. బిడ్డలు తండ్రిపట్లలాగే మనంకూడ తనపట్ల, ఒకవైపున అనురాగంతోను మరొకవైపున మేరమర్యాదలతోను మెలిగేభాగ్యాన్ని దయచేస్తాడు. మనతరపున మనం మన పాపాలకు ఎప్పడూ చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడుతూండాలి. పశ్చాత్తాప తప్తమైన హృదయాన్ని నీ వనాదరం చేయవు అన్నాడు కీర్తనకారుడు - 51, 17. ఈ పశ్చాత్తాప భావం మనలో దైవభయాన్ని పెంచుతుంది.

5.తెలివి

1. తెలివి అంటే ఏమిటి?

ఈ వరం ద్వారా సృష్టివస్తువులు దేవునిమీద ఆధారపడి వుంటాయనీ, అతడు అన్నిటికీ ఆదికారణమనీ గ్రహిస్తాం. సృష్టి వస్తువుల్లో దేవుణ్ణి గుర్తించి అతన్ని కొలుస్తాం. కనుక ఇది లోకవస్తువులన్నింటిలోను, అన్ని కార్యాల్లోనుగూడ దేవుణ్ణి గుర్తించడానికి వుపయోగపడే వరం.

ప్రభువు తాను చేసిన వస్తువులన్నింటిలోను ప్రతిబింబిస్తూనే వుంటాడు. పాపంచేయకముందు ఆదాము అన్నిటిలోను దేవుణ్ణి గుర్తించేవాడు. కాని పాపం చేసాక అతడు ఆ శక్తిని కోల్పోయాడు. అతని సంతతిమై అతని పాపంవల్ల పతనమై పోయిన మనకు కూడ ఈ శక్తిలోపించింది. క్రీస్తు సిలువమీద మరణించి పాపానికి పరిహారంచేసి ఈ శక్తిని మనకు మల్లా సంపాదించి పెట్టాడు. ఇప్పడు క్రీస్తు ఆత్మ తెలివి అనే వరం