పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఎఫేము భక్తుడు ఆత్మను అగ్నితో వుపమిస్తూ ఈలా వ్రాసాడు. మరియమాత గర్భంలో అగ్నీ ఆత్మా వున్నారు మనం పొందే జ్ఞానస్నానంలో అగ్నీ ఆత్మా వున్నారు మనం స్వీకరించే సత్రసాదంలో అగ్నీ ఆత్మా వున్నారు రొట్టెలో వున్న ఆత్మను మనం భుజించలేం ద్రాక్షరసంలో వున్న అగ్నిని మనం త్రాగలేం మన పెదవులు స్వీకరించే ఈ యప్పరసాలు అద్భుత వస్తువులు అనుకోవాలి.

32. తల్లిగా ఆత్మ

1. దేవునికి తండ్రి అని పేరు. క్రీస్తుకి కుమారుడని పేరు. కాని ఆత్మకు ఏ పేరూ లేదు. తండ్రి కుమారులకు లాగ అతనికి ఏ సంబంధమూ లేదు. దేవుడు నరుడ్డి తనకు పోలికగా చేసాడు. ఈ నరుడు ఫ్రీ పురుషులనుగా వుంటాడు. నరుళ్ళో స్త్రీత్వమంది కనుక అతనికి ఆదిరూపమైన భగవంతుజ్లో గూడ స్త్రీత్వముండి వండాలి. ఈ స్త్రీత్వం, మాతృత్వం, పవిత్రాత్మలో గోచరిస్తుంది. 2. పవిత్రాత్మ మనలను దేవునికి బిడ్డలనుగా చేస్తుంది. కనుక ఈ యాత్మ తల్లిలాంటిది. ఓవిధంగా చెప్పాలంటే, ఆత్మ దేవునికి గర్భంలాంటిది. ఈ గర్భం నుండే మనం ఆధ్యాత్మికంగా జన్మిస్తాం. శ్రీసభలో వాడుకలోవున్న రెండు సంకేతాలు ఆత్మ తల్లిలాంటిదని నిరూపిస్తాయి. మొదటిది, శ్రీసభను తల్లి అని వాకొంటాం. ఈ శ్రీసభలో ఆత్మ వసిసూంటుంది. మనం శ్రీసభ గర్భంనుండీ, ఆ సభలో వసించే ఆత్మ గర్భంనుండీ, బిడ్డల్లాగ జన్మిస్తాం. కనుక ఆత్మ మనకు తల్లి, రెండవది, మనం జ్ఞానస్నాన జలంనుండి ఆధ్యాత్మికంగా జన్మిస్తాం. జలం అన్ని ప్రాణులకు పుట్టుకనిచ్చే తల్లి, స్త్రీగర్భంకూడ జలమయంగానే వుంటుంది. దానిలోనే మనుష్య పిండం పెరుగుతుంది. ఇక, జ్ఞానస్నాన జలం ఆత్మకు చిహ్నం. కనుక మనం ఆత్మ అనే తల్లినుండి ఆధ్యాత్మికంగా జన్మిస్తాం.

3. బైబులు దేవుణ్ణి తల్లితో పోలుస్తుంది. యెషయా ఈలా వాకొన్నాడు.

"స్త్రీ తన పసికందును మరచిపోతుందా?
తన ప్రేవున పుట్టిన బిడ్డమీద
జాలిజూపకుండా వుంటుందా? ఆమె తన శిశువును మరచిపోయినా