పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేను మాత్రం మిమ్మ మరచిపోను" - 49,14-15. "తల్లి కుమారునివలె నేను మిమ్మ ఓదారుస్తాను యెరూషలేమన మిమ్మ ఓదారుస్తాను" - 66,13.

ఈ వాక్యాలు పేర్కొనే దైవమాతృత్వం పవిత్రాత్మకు బాగా వర్తిస్తుంది. జూల్యానా అనే భక్తురాలు 15వ శతాబ్దంలో ఇంగ్లండులోని నోర్విచ్లో జీవించింది. ఈమె తండ్రినీ క్రీస్తునీ తల్లి అనే పిల్చింది. కనుక దేవుడు తల్లి అనే భావం మన క్రైస్తవ సంప్రదాయంలో వుంది. పవిత్రాత్ముడే ఈ తల్లి.

ఆత్మనుగూర్చి మాట్లాడేపుడు ఈయబడ్డం, వరం, ప్రేమ అనే మూడు పదాలు వాడతాం. ఆత్మ మనకు దేవునిచే ఈయబడింది. మూడవవ్యక్తి వరమూ ప్రేమా కూడ. ఇక, ఈ మూడు పదాలు తల్లికిగూడ వర్తిస్తాయి. తల్లి శిశువుకి ఈయబడుతుంది. తల్లి శిశువుకి వరంగాను ప్రేమగాను వుంటుంది. కనుక ఆత్మకూడ తల్లి లాంటిది అనుకోవాలి. ప్రాచీన క్రైస్తవులు ఆత్మను తల్లిగానే భావించారు.

4. ఆత్మ మనపట్ల నిత్యమూ తల్లిలాగే మెలుగుతుంది. తల్లి బిడ్డను పాలతో పెంచుతుంది. ఆత్మకూడ మనలను వాక్యమనే పాలతో పెంచుతుంది - 1పేత్రు 2,2. ఆత్మ మనచే మన తండ్రియైన దేవుణ్ణి నాన్నా అని పిలుస్తుంది - గల 4,6. మనం క్రీస్తుని దేవుణ్ణిగా విశ్వసించేలా చేస్తుంది - 1కొ 12,3.తోడి నరులపట్ల ప్రేమభావం జూపి వారిని సోదరీ సోదరులనుగా అంగీకరించేలా చేస్తుంది - గల 5,22. ఓ తల్లిలా చిన్నబిడ్డలమైన మనకు ప్రార్ధనం నేర్చుతుంది - రోమా 8,26. భౌతికరంగంలో తల్లి బిడ్డకు ఎన్ని సేవలు చేస్తుందో ఆధ్యాత్మిక రంగంలో ఆత్మ మనకు అన్ని సేవలు చేస్తుంది.

5. క్రీస్తు శిష్యులను విడనాడి వెళ్ళిపోకముందు వారికి ఆత్మ మరియమాత అనే రెండు వరాలు దయచేసాడు. ఈ యాత్మా మరియమాతా కలసే పనిచేస్తుంటారు. మరియ ఆత్మశక్తితోనే గర్భవతి ఐంది, మరియమాత గర్భాన్ని ఫలభరితం చేసింది ఆత్మే దేవుడు ఆత్మ అనే గర్భంనుండి తన కుమారుడు జన్మించేలా చేసాడు. పవిత్రాత్మ క్రీస్తు జన్మించినపుడు తల్లిగా వ్యవహరించింది. అలాగే మనం ఆధ్యాత్మికంగా జన్మించేపుడుగూడ తల్లిగా వ్యవహరిస్తుంది.

6. ఆత్మ తల్లి లాంటిదని చెప్పాం. కనుక తల్లిలాగే శ్రీసభలో నెలకొని వుంటుంది. తల్లిలాగే ఆ సభను నడిపిస్తూంటుంది. ఆత్మశ్రీసభలో ఓ అధికారిలాగ పెత్తనం చెలాయించదు. ఓ తల్లిలాగ వినయంతో, ప్రేమతో సేవలు చేస్తుంది - మత్త 20,25-28.