పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోక్షభాగ్యం మనకు కూడ లభిస్తుంది - రోమా 8,17. కాని ఈ మోక్షభాగ్యం మనకు లభించేలా చేసేది పవిత్రాత్మే.

2. మన శ్రమల్లో ఆత్మసాన్నిధ్యం వుంటుందని చెప్పాం. అలాగే మన మరణంలోకూడ ఆత్మప్రత్యక్తమై వుంటుంది. మనం క్రీస్తు మరణోత్థానాల్లోకి జ్ఞానస్నానం పొందుతాం. - రోమా 6,3. అతడు శారీరకంగా మరణించినట్లే మనం పాపజీవితానికి మరణిస్తాం. అతడు శారీరకంగా ఉత్తానమైనట్లే మనం పుణ్యజీవితానికి ఉత్థానమౌతాం. జ్ఞానస్నానంలో క్రీస్తు మరణం మనమీద సోకి మనకు జీవాన్నిస్తుంది. కాని జీవశక్తి ఎప్పడూ ఆత్మనుండే.కనుక ఉత్థాన క్రీస్తు ఆత్మ మన జీవితంలోను మరణంలోను మనమీద సోకి మనకు జీవశక్తిని దయచేస్తుంది.

క్రైస్తవ భక్తుడు తన శ్రమల్లోను మరణంలోను గూడ తన్నుతాను ఆత్మకు అర్పించుకోవాలి. ఆ యాత్మ నుండి ఓదార్పునూ శక్తినీ పొందాలి.

ప్రార్థనా భావాలు

1.రిచర్డ్ ఆఫ్ సెంట్ విక్టర్ అనే భక్తుడు ఈలా నుడివాడు.

తండ్రిలో ఏకత్వమంది
బహుత్వం క్రీస్తుద్వారా లభిస్తుంది
కాని త్రీత్వాన్ని సమాప్తం చేసేది మాత్రం పవిత్రాత్మే

2. భద్రమైన అభ్యంగనంద్వారా గృహస్టులు ఆత్మను పాంది బాలఢ్యులౌతారు. క్రీస్తుకి సాక్షులౌతారు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తారు. తమ మాటలద్వారా చేతలద్వారాగూడ శ్రీసభ వ్యాప్తికి తోడ్పడతారు.

31. ఆత్మ వినయం

1. ఎప్పడుగూడ స్వచ్ఛమైన ప్రేమ వినయంతో నిండివుంటుంది. కాని ఆత్మ ప్రేమకు నిలయం. అందుచే ఆత్మకుండే వినయం అంతా యింతా కాదు.

త్రీత్వంలో ఆత్మ వినయంతో తన్నుతాను తగ్గించుకొంటుంది. ఆ యాత్మ తండ్రినీ క్రీస్తునీ మనకు తెలియజేస్తుంది. కాని మూడవవ్యక్తిని మనకు తెలియజేసేవాళ్ళెవరూ లేరు. తండ్రి కుమారుని పంపుతాడు. కుమారుడు ఆత్మను పంపుతాడు. కాని ఆత్మడు ఎవరినీ పంపడు. ఆత్మ తండ్రినీ కుమారునీ మహిమపరుస్తుంది. కాని ఆత్మను మహిమ