పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వారా, వేదవాక్యం ధ్యానం చేసికోవడంద్వారా - ఇంకా నానాపవిత్రకార్యాలద్వారా మనం ఆనందించేలా చేస్తుంది.

ప్రార్థనా భావాలు

1. నేడు చాల తావుల్లో పవిత్రాత్మకూటాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ఆత్మపట్ల భక్తిని పెంపొందించుకోవడానికి బాగా వుపయోగడపడతాయి. ఈ కూటాల్లో వేదసత్యాలనుగూర్చిన నిర్వచనాలుండవు. వాటనిగూర్చిన వివరణలుంటాయి. వేదసత్యాలను కథలరూపంలో వివరిస్తారు. సాక్ష్యాలరూపంలో బలపరుస్తారు. పాటలరూపంలో గానం చేస్తారు. కనుక ఈ సమావేశాలు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి. భక్తులు వీటిల్లో పాల్గొని ఆత్మను లోతుగా అనుభవానికి తెచ్చుకోవాలి.

2. పౌలు బోధకీ యోహాను బోధకీ వ్యత్యాసముంది. పౌలు దైవపుత్రత్వమూ మోక్షభాగ్యమూ మనకు ఈ లోకంలో ఇంకా పూర్తిగా లభింపలేదని చెప్పాడు.ఆ భాగ్యాలు మోక్షంలోగాని సంపూర్తిగా లభించవన్నాడు. కాని యోహాను మనకు ఈ భాగ్యాలు ఈ లోకంలోనే లభించాయని చెప్పాడు. మనం క్రీస్తుని నమ్మి అతని ఆత్మను పొందాం గనుక ఈ భాగ్యాలు ఇక్కడే సమృద్ధిగా లభించాయి అనుకోవాలి.

30. మన బాధల్లో మరణంలో ఆత్మ

1. మన బాధల్లోను మరణంలోను ఆత్మ సాన్నిధ్యం వుంటుంది. పూర్వం బాధామయ సేవకుడు ఆత్మ సాన్నిధ్యంతోనే బాధలు అనుభవించాడు - యెష 42,1. సిలువపై మరణించిన క్రీస్తు ప్రక్కనుండి నీళ్ళూ నెత్తురూ స్రవించాయి కదా! - యోహా 19,34.ఈ నీళ్లు ఆత్మను సూచిస్తాయి. కనుక క్రీస్తు శ్రమల్లోను మరణంలోను గూడ ఆత్మ ప్రత్యక్షమై వుంటుంది.

వేదహింసలు మనకు శ్రమలను దెచ్చిపెడతాయి. ఈ శ్రమల్లో మనం శత్రువులముందు ఏమి మాట్లాడాలా అని కంగారు పడనక్కరలేదు. మనలో వుండే ఆత్మే ఆ సమయంలో మనం పలకవలసిన పలుకులు పలికిస్తుంది - మత్త 10,20. అనగా మన శ్రమల్లో ఆత్మ మనకు సహాయం చేస్తుంటుంది. మనం క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం ధన్యమని యెంచాలి. ఆ శ్రమల్లో దేవుని ఆత్మ మనమీదికి దిగివస్తుంది - 1షేత్రు 4,14. క్రీస్తుతోపాటు మనం కూడ శ్రమలు అనుభవిస్తే అతని వారసమైన