పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{{చెంతెర్|

25. ప్రార్థన చేయించే ఆత్మ

}]

1. తొలినాటి క్రైస్తవులు బృందంగాగూడి భక్తితో ప్రార్థన చేసేవాళ్ళు ー1కొరి 11,18. ఆత్మే మనచే ప్రార్థన చేయిస్తుందని పౌలు స్పస్ట్ంగా చెప్పాడు. మనం ఆధ్యాత్మికంగా బలహీనులం. ఎప్పడు, దేనికొరకు, ఏలా ప్రార్ధించాలో మనకు తెలియదు. మన దౌర్భాగ్యాన్ని తలంచుకొని ఆత్మ బాధపడుతుంది, విలపిస్తుంది. ఆత్మేమన తరపున ప్రార్ధన చేయడం మొదలుపెడతుంది. కాని మనచేగూడ జపం చేయించి మన జపాన్ని తన జపంతో జోడిస్తుంది. తల్లి పసిబిడ్డను వేలిచ్చి నడిపించినట్లే మనలను ప్రార్థనలో నడిపిస్తుంది. ఈలా ఆత్మ మనకొరకు, మనతోగలసి, మనలోనే ప్రార్థన చేస్తుంటే అందరి హృదయాలు తెలిసిన తండ్రి ఆ ప్రార్థనను వెంటనే అర్థంజేసికొంటాడు. ఆత్మ మన రక్షణాన్ని పురస్కరించుకొనే ప్రార్థన చేస్తుంది. కనుక తండ్రి ఆ ప్రార్థనను తప్పక అంగీకరిస్తాడు - రోమా 8,26-27. జపాన్ని గూర్చి పౌలు చెప్పిన ఈ వాక్యాలు చాల విలువైనవి.

ఇంకా ఆత్మ మనం ఎడతెగక ప్రార్థన చేసేలా చేస్తుంది - 1తెస్స 5,17. దేవునినుండి మనం పొందిన ఉపకారాలకు ఆ తండ్రికి వందనాలు చెప్తూ ప్రార్థన చేసేలా చేస్తుంది - కొలో 3,16. ప్రార్థన ద్వారా మనం చాలా వరాలు పొందవచ్చు, కాని అన్నిటికంటె శ్రేష్టమైన వరంగా ఆ యాత్మనే పొందుతాం - లూకా 11,13.

ప్రార్థనద్వారా ఆత్మ మనలను దేవుని బిడ్డలనుగా జేస్తుంది. పవిత్రాత్ముడు మన హృదయాల్లోవుండి మనచే దేవుణ్ణి అబ్బా అనగా నాన్నా అని పిలిపిస్తాడు. పూర్వవేదంలో ఏ యూద భక్తుడు కూడ ఇంత చనువుతో దేవుణ్ణి నాన్నా అని సంబోధించలేదు. క్రీస్తే మొదటిసారిగా ఈలా జపించాడు - మార్కు 14-36. ఈనాడు మనం ఆత్మశక్తితో క్రీస్తు ప్రార్థనను మన ప్రార్థనగా జేసికొంటాం. ఇది చాల శ్రేష్టమైన జపం.

మనం ఆత్మయందు, అనగా ఆత్మ ప్రేరణంతో జపిస్తాం - ఎఫె 6,18, ఆత్మ ప్రేరేపించందే మనంతట మనం ప్రార్థన చేయలేం. ఇంకా, మన ప్రార్థన చాలసారులు స్పష్టంగా వుండదు, మనుష్యులముందేగాదు, దేవునిమందు కూడ మన భావాలూ కోరికలూ స్పష్టంగా తెలియజేయలేం. అందుచే మన వేడికోలు అవ్యక్తంగా వుండిపోతుంది, ఈలాంటి సందర్భాల్లో ఆత్మ మన జపానికి ఓ రూపమంటూ ఇస్తుంది. దాన్ని స్పష్టంజేసి దేవునిమందు పెడుతుంది.

ఉత్థాన క్రీస్తు మోక్షంలోవుండి తండ్రి సమక్షంలో మనకొరకు జపిస్తాడు - హెబ్రే 7,25. కాని పవిత్రాత్మ మన హృదయంలోనే వుండి మనకొరకు జపిస్తుంది. ఈ