పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిరువురు దైవవ్యక్తుల ప్రార్థనాబలంవల్లనే మనం కొద్దోగొప్పో భక్తిని అలవరచ్చుకోగల్లుతున్నాం - రోమా 8,15.

2. తరతరాల పొడుగునా పునీతులకు జపం నేర్పింది ఆత్మ భక్తులచే మహా ప్రార్థనలు చేయించింది ఆత్మ పుణ్యాత్ములకు భక్తిపారవశ్యాన్ని కలిగించింది ఆత్మ బైబుల్లోని ప్రశస్త్రజపాలైన కీర్తనలను వ్రాయించింది ఆత్మ.

వేదవాక్యాన్ని చదువుకొని ప్రార్ధన చేసికోడానికి పవిత్రాత్మ విశేషంగా తోడ్పడుతుంది. బైబులు వాక్యాన్ని జపించే విధానంలో మూడు మెట్లున్నాయి. మొదటిది, భక్తిభావంతో పవిత్రగ్రంథంలోని ఓ వాక్యాన్ని చదువుకొంటాం. రెండవది, ఆ వాక్యం భావమేమిటా అని కొంచెం సేపు ఆలోచించి చూస్తాం. ఆత్మే మన హృదయంలో వెలుగును పుట్టించి మనం ఆ వాక్యాం అర్ధాన్ని గ్రహించేలా చేస్తుంది. మూడవమెట్టు, ఆ పాక్యాన్ని పురస్కరించుకొని ప్రార్ధన చేసికొంటాం. ఈ ప్రార్ధన మనవి, కృతజ్ఞత, పశ్చాత్తాపం, ఆరాధన అనే నానారూపాల్లో వుండవచ్చు. ఈ జపాన్ని నడిపించేది ఆత్మే ఈలా మొదటి వాక్యాన్ని పురస్కరించుకొని ప్రార్థించాక దాని తర్వాతి వాక్యానికి వెత్తాం. ఈవిధంగా మనకు అందుబాటులోవున్న కాలాన్నిబట్టి బైబుల్లోని ఓ వాక్యాన్నిగాని పేరానుగాని అధ్యాయాన్నిగాని ముగించుకొంటాం, ఇది సులువైన ప్రార్ధనాపద్ధతి.

ప్రార్ధనా భావాలు

1. కీర్కెగార్డ్ అనే భక్తుడు ఈలా జపించాడు. "ఆత్మమా! పవిత్రాత్ముడవైన నీవు అపవిత్రుడైన నరుళ్ళి, మురికి మానిసిలో వసిస్తావు. జ్ఞానివైన నీవు మూరుడైన నరుల్ల్లో వసిస్తావు. సత్యానివైన నీవు మోసగాడైన నరుట్లో జీవిస్తావు. ఆత్మమా! నీవు నా హృదయాన్ని కూడ నీకు నివాసయోగ్యంగా తయారుచేయి. నా యెడదలోని మాలిన్యాన్నీ మూర్ధత్వాన్నీ మోసాన్నీ తొలగించి దానిలో వసించు." ఈ జపం మనంకూడ జపించదగ్గది.

2. ఓ ప్రాచీన భక్తుడు ఈ వుపమానాలు చెప్పాడు. ఆత్మ మనలను దేవునిలోకి మార్చివేస్తుంది. ద్రాక్షరసంలో పడిన నీటిబొట్టు రసమైపోతుంది. నిప్పలో పెట్టిన ఇనుపముక్క నిప్పయిపోతుంది. సూర్యరశ్మి సోకిన గాలి తానూ వెల్లురైపోతుంది. అలాగే ఆత్మతో ఐక్యమైపోయిన మనం కూడ ఆత్మలోనికి మారిపోతాం.

3. పాపిలో ఆత్మ వసించదు. పవిత్రునిలో వసిస్తుంది. కనుకనే ప్రాచీన క్రైస్తవులు భక్తులను "ఆత్మధరులు" అని పిల్చేవాళ్ళు.