పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17.నరుల్లో దేవుని పోలికను కలిగించే ఆత్మ

1. దేవుడు మట్టిముద్దలోనికి తన శ్వాసను ఊదగా ఆ ముద్ద జీవంగల ప్రాణి ఐంది - ఆది 2,7. అతడే ఆదిమ మానవుడు, ఆదాము. ఆ శ్వాస పవిత్రాత్మే అది దేవుని వూపిరి. ఆ యాత్మ మనలోనికి ప్రవేశించింది కనుక మనం “ఆధ్యాత్మిక’ మానవులమయ్యాం. ప్రాచీన భక్తులు వాకొన్నట్లుగా ఆత్మ మన ఆత్మకే ఆత్మ ఆ యాత్మ మనలో వుండబట్టే మనం నిత్యం దేవుణ్ణి కోరుకొంటున్నాం. అతనితో ఐక్యంకాగోరుతున్నాం. అతనివైపు పయనిస్తున్నాం. బాసిల్ భక్తుడు చెప్పినట్లు, ఆరోగ్యంగావున్న కన్ను వస్తువులను చూస్తుంది. ఆత్మతో నిండివున్న నరుడు దేవుణ్ణి దర్శిస్తాడు. దేవుడు నరుడ్డి తనకు పోలికగా చేసాడు - ఆది 1,26-27. ఈ పోలిక, లేక రూపం, నరునికి తనలోని దైవశ్వాస వల్లనే, అనగా దేవుని ఆత్మవల్లనే వచ్చింది. ఈ పోలిక నరునికి లభించిన ఏదో వొక గుణంకాదు. అసలు నరుడే దేవుని పోలిక. కాని దేవునికి ప్రధానమైన పోలిక క్రీస్తే - కోస్తే 1,15. ఆ క్రీస్తుద్వారానే మనం దేవుని పోలికను పొందాం. అతని ద్వారానే దేవునితో ఐక్యంగావాలని అభిలషిస్తాం. ఇప్పుడు మనం మొదట జ్ఞానస్నానంలో క్రీస్తు పోలికను పొంది ఆ పోలికద్వారా దేవుని పోలికను పొందుతాం. కనుక మనం దేవుని పోలికకు పోలికగా వుంటాం అని చెప్పాలి. 2. నరుడు పాపంచేసి దేవుని పోలికను కోల్పోయాడు. కాని క్రీస్తు తన మరడోత్తానాలద్వారా మనలో ఈ పోలికను పునరుద్ధరించాడు. కాని యిప్పడు మన హృదయంలో క్రీస్తు పోలికనూ దేవుని పోలికనూ నెలకొల్పేది పవిత్రాత్మే అతడు గొప్ప చిత్రకారుడు. మన హృదయంలో దైవరూపాన్ని చిత్రించేది అతడే. దేవునికీ మనకూ ఐక్యతను సాధించిపెట్టేది దైవాత్ముడే 2పేత్రు 1,4. మనం దైవ స్వభావంలో పాలుపొందామని చెప్తుంది. దేవుని పోలిక వల్లనే మనకు దైవస్వభావం సిద్ధించింది. దేవుడు నరుడ్డి రెండు దశల్లో సృజించాడు. మొదటిది ప్రాతసృష్టి అనగా ఆదాము సృష్టి కాని మానవజాతి పాపంవల్ల పతనమై దేవుని పోలికను కోల్పోయింది. దేవుడు క్రీస్తు మరణోత్తానాలద్వారా నరులను మళ్ళా నూత్నంగా సృష్టించాడు. మనం మళ్ళా దేవుని రూపాన్ని పొందాం. ఈ రెండు దశల్లోను నరుళ్ళి దేవుని రూపాన్ని నెలకొల్పింది ఆత్మే భగవంతుడు లోకాన్ని నరునికొరకు సృజించాడు. కాని నరుడ్డి తనకొరకు సృజించాడు. కనుక ఆత్మ తాను నరుళ్ళో పుంచిన దైవరూపంద్వారా అతన్ని నిరంతరం