పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన దేహంలోని అవయవాలను మన ఆత్మ ఒక్కటిగా బంధిస్తుంది. కనుకనే మన అవయవాలన్నీ కలసి ఐక్యభావంతో పనిచేస్తున్నాయి. ఈలాగే శ్రీసభ అనే జ్ఞానదేహంలో అవయవాలైన క్రైస్తవులందరినీ ఐక్యపరచేది పవిత్రాత్మే ఈ యాత్మ శక్తివల్లనే క్రైస్తవులు ఏ దేశానికి చెందినా, ఏ జాతికి చెందినా, ఏ కాలానికి చెందినా ఒకరినొకరు అంగీకరింపగల్లుతున్నారు.

పతితులు తమ దబ్బరబోధలతో శ్రీసభలోని కొందరిని అపమార్గం పట్టిస్తారు. తిరుసభను విభజిస్తారు. కాని ఆత్మ ఆ సభను నిరంతరం ఐక్యపరుస్తుంది. eyes; లోకాన్నంతటినీ ఒక్కటిగా కలిపేస్తుంది - జ్ఞాన 1,7.

3. శ్రీసఖేమో ఒక్కటే. ఐనా దానిలో చాల అవయవాలూ, చాల భాగాలూ వున్నాయి, క్రీస్తు పెక్కు అవయవాలతో కూడిన ఒక్క శరీరం వంటివాడు. పెక్కు అంగాలతో కూడిన శరీరం ఒక్కటే గదా! 1కొ 12,12. దేవుడు ఒక్కడైగూడ ముగ్గురు వ్యక్తులుగా వున్నాడు. అలాగే ఆ దేవుని సమాజమైన తిరుసభకూడ ఒక్కటైనా భిన్నభిన్న వ్యక్తులతో కూడివుంది. ఐక్యతా విభిన్నతా రెండూ దాని లక్షణాలు. ఈ రెండు లక్షణాలకూ కర్త పవిత్రాత్మే. ఈ యాత్మ శ్రీసభ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దయచేస్తుంది - 1కొ 12, 11. ఈ వరాల వలన మనలో వైవిధ్యం ఏర్పడుతుంది. తిరుసభ సభ్యులు ఎప్పుడూ ఐక్యమైయుండాలి. ఐనా ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. పవిత్రాత్ముడు కోరేది యిదే. ఆ యాత్మడు ఐక్యతకూ భిన్నత్వానికి గూడ కర్త అని చెప్పాం. మూస:చcenter

1. పేత్రు 4,10 పలురకాల ప్రజలు దేవుని నుండి పలురకాల వరాలను పొందుతారని చెప్తుంది. శ్రీసభ క్రీస్తు శరీరం. ఆ శరీరానికి జీవమిచ్చేది ఆత్మే ఆ శరీరంలో మనమందరం సభ్యులం. పుణ్యపురుషుడైన హేబెలునుండి ఎన్నుకోబడినవారిలో చిట్టచివరి వ్యక్తివరకు అందరికీ వరాలిచ్చేది, అందరి విశ్వాసాన్ని పెంచేది ఆత్మే ఆ యాత్మడు తానొక్కడైకూడ భిన్న వ్యక్తులకు భిన్న వరాలిస్తాడు- 1కొ 12,11.

1. "సాలోమోను గీతాలు" అనే గ్రంథాన్ని వ్రాసిన ఓ సిరియా భక్తుడు ఈలా నుడివాడు. “సంగీతకారుడు వాద్యాన్ని చేతబట్టి తంత్రులను మీటగానే అది మధుర సంగీతం పలుకుతుంది. అలాగే దేవుని ఆత్మ నా హృదయ తంత్రులను మీటగానే నేనతని ప్రేమద్వారా స్తుతిగీతాలు పలుకుతాను". ఈ భక్తునిలాగే మనంకూడ ఆత్మ ప్రభావంతో దేవుణ్ణి స్తుతించాలి.