పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు మరణించి పునరుత్తానుడై తన ఆత్మను కుమ్మరింపగా శ్రీసభ పుట్టింది. అది క్రీస్తు దేహం. ఆ దేహం మనమే.

ప్రార్థనా భావాలు

1. మనం శ్రీసభలో ఆత్మసాన్నిధ్యాన్ని అట్టే గుర్తించం. శ్రీసభకూ ఆత్మకూ చాల దగ్గిర సంబంధం వుంది. ఇరెనేయస్ భక్తుడు ఈలా నుడివాడు. శ్రీసభ వున్నచోట పవిత్రాత్మ వుంటుంది. పవిత్రాత్మ వున్నచోట శ్రీసభ వుంటుంది. సకల వరాలూ వుంటాయి. కనుక శ్రీసభలో చేరనివాళ్ళు ఆత్మ వరాలు పొందలేరు.

2. శ్రీసభ దేశదేశాల్లో విస్తరించివున్న బ్రహ్మాండమైన క్రైస్తవ సమాజం. ఈ క్రైస్తవులంతా కలసి ఐక్యభావంతోను పవిత్రంగాను జీవించడంలోనే పవిత్రాత్మశక్తి కన్పిస్తుంది. ఈ పవిత్రత, ఐక్యత అనేవి నరమాత్రులవల్ల సిద్ధించే లక్షణాలు కావు, దైవశక్తివల్ల లభించే గుణాలు,

16. క్రీస్తుతో ఐక్యంజేసే ఆత్మ

1. ఆత్మ మనలను క్రీస్తుతో ఐక్యంజేస్తుంది. ఈ యైక్యత జ్ఞాస్నానం ద్వారా ప్రారంభమౌతుంది. మ నమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాం - 1కొ 12,13. అనగా మనం ఆత్మ అనుగ్రహం వల్ల క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది ఒక్కసమాజానిమయ్యాం, మనుష్యావతార సమయంలో ఆత్మ సుతునికి ఓ దేహమిచ్చింది. ఇప్పుడు మళ్ళా శ్రీసభ అనే దేహాన్నిస్తుంది.

2. అప్పరసాలను దివ్యసత్రసాదంగా మార్చేది ఆత్మే ఈ సత్రసాదంకూడ క్రీస్తు శరీరమే. ఆత్మతో నిండివున్న ఈ దివ్యభోజనాన్ని ఆరగించి మనం క్రీస్తుతో ఐక్యమౌతాం. ఒకే రొట్టెలో పాలుపంచుకొనే మనం ఒక్క శరీరమౌతాం - 1కొ 10,17, ఆత్మ మనలను క్రీస్తుతో కలుపుతుంది. ఈ కలయికద్వారా మనమంతా క్రీస్తనే వరునికి వధువులమౌతాం. క్రీస్తనే శరీరంలో అవయవాలమౌతాం. అతడు తన శరీరమైన శ్రీసభకు శిరస్సు - కొల్లో 1,18. ఎప్పడుగూడ ఆత్మ మనలను తనతోగాక క్రీస్తుతో ఐక్యంజేస్తుంది,

శ్రీసభ కేవలం సాంఘిక, ఆర్థిక అవసరాలను తీర్చే సంఘం మాత్రమేకాదు. అది క్రీస్తునుండీ ఆత్మనుండీ ఉద్భవించింది. ఆధ్యాత్మికమైంది. ఆ సభలోనే చేరిన మనంకూడ ప్రభువుతో ఐక్యమౌతాం.