పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు శరీరమైయున్నారు. ప్రతివ్యక్తి దానిలో ఒక భాగమే" అని వ్రాసాడు - 1కొ 12,27. ఉత్తాన శరీరంతోపాటు శ్రీసభకూడ క్రీస్తు దేహం. ఈ దేహం మనమే. ఈ దేహనిర్మాత ఆత్మే

2. ఉత్తాన క్రీస్తు శిష్యులమీదికి శ్వాసను ఊదాడు. ఈ శ్వాస పవిత్రాత్మే ఈ యాత్మ ద్వారా వారికి పాపాలను పరిహరించే శక్తి లభించింది - యోహా 20,21-23. క్రీస్తు ఈలా శ్వాసనూదడం, సృష్ణ్యాదిలో దేవుడు మట్టి ముద్దలోనికి శ్వాసనూదడాన్ని జ్ఞప్తికి తెస్తుంది - ఆది 2,7, ఆ శ్వాసకూడ పవిత్రాత్మే అక్కడ ఆ శ్వాసద్వారా మనుష్య సృష్టి జరిగింది. ఇక్కడ ఈ శ్వాసద్వారా శ్రీసభ అనే సృష్టి జరిగింది.

3. అపోస్తలుల చర్యల ప్రకారం పెంతెకోస్తు దినాన శ్రీసభ ఆవిర్భవించింది. ఆనాడే ఆత్మ శిష్యులమీదికి గాలిలా, అగ్నిలా, నాలుకల్లా దిగివచ్చింది - 2.1-4 పేత్రు ఈ యంశాన్ని ఈలా వివరించాడు: ఉత్తానక్రీస్తు తండ్రి కుడిప్రక్కను చేరుకొని అతనినుండి ఆత్మను పొందాడు. తాను పొందిన ఆత్మను శిష్యులమీద కుమ్మరించాడు. అదే పెంతెకోస్తు లేక ఆత్మ దిగిరావడం - 2,33. ఈ యంశాన్ని క్రీస్తు ముందుగానే శిష్యులకు ఎరిగించాడు. అతడు మీరు ఆత్మతో జ్ఞానస్నానం పొందుతారు అని చెప్పాడు - 1,5. యెరూషలేములో తొలినాటి భక్తసమాజం 120 మంది - 1,15. వీళ్ళంతా నీటితోగాక ఆత్మతోనే జ్ఞానస్నానం పొందారు. వీళ్ళే తొలి శ్రీసభ. అనగా శ్రీసభను ప్రారంభించింది ఆత్మే ఈ సందర్భంలో ఇరెనేయస్ వేదశాస్త్రి ఈలా చెప్పాడు. “తండ్రి తన వాక్కుతోను శ్వాసతోను శ్రీసభను సృజించాడు, అవి రెండు అతనికి రెండు చేతుల్లాంటివి. ఈ రెండు చేతులతోనే అతడు పూర్వం ఆదాముని చేసాడు." ఇక్కడ ఈ వేదశాస్త్రి దృష్టిలో తండ్రి వాక్కు క్రీస్తు తండ్రి శ్వాస పవిత్రాత్మ

చనిపోయిన క్రీస్తుని మళ్ళా సజీవుని చేసింది ఆత్మే - రోమా 8,11. శ్రీసభకు ఊపిరిపోసింది గూడ ఆత్మే కనుక క్రీస్తుతోపాటు ఆత్మడుకూడ శ్రీసభను స్థాపించాడు అని చెప్పాలి. తండ్రి క్రీస్తునీ ఆత్మనుకూడ శ్రీసభలోనికి పంపాడు,

4. ఆత్మ ప్రారంభించిన శ్రీసభ ఆత్మశక్తితోనే చెందడం మొదలుపెట్టింది. సమరయలోని భక్తసమాజం ఆత్మను పొందింది - 8,14-17. కైసరియలోని కొర్నేలి బృందం ఆత్మను పొందింది – 10,44–48, ఎఫెసు నగరంలోని భక్తులు ఆత్మను పొందారు - 19,1-7. ఈ విధంగా తిరుసభ పెంపజెందుతూ వచ్చింది. క్రైస్తవులందరూ ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందారని వాకొన్నాడు పౌలు. "మనమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాం? - 1కొ 12,13.