పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యేసు జననానికి ఓ పవిత్ర గర్భాన్ని వెదికాడు. ఆ గర్భం అతనికి కన్య మరియలో దొరికింది. ఆ నిర్మల గర్భమే దేవుణ్ణి మానవలోకంలోకి తీసుకవచ్చింది. మరియు ఒక్క క్రీస్తకేకాదు, అతని దేహమైన తిరుసభకు కూడ తల్లి, క్రీస్తు మనకు శిరస్సు, మనమందరమూ అతనిలో ఇమిడే వున్నాం. కనుక మరియు మనందరికీ తల్లి, నేడు క్రీస్తు సాన్నిధ్యంలాగే ఆ తల్లి సాన్నిధ్యంకూడ తిరుసభలో నెలకొనివుంది. మరియను క్రీస్తుకి, శారీరకంగా తల్లిని జేసిన ఆత్ముడే ఆమెను తిరుసభకుకూడ ఆధ్యాత్మికంగా తల్లిని చేసాడు. ఆత్మకు వశవర్తినియై జీవించిన మరియు నేడు మనంకూడ ఆ యాత్మ ప్రేరణలకు లొంగి జీవించాలని హెచ్చరిస్తుంది.

ప్రార్థనా భావాలు

1. ఆత్మ దేవునికీ మనకూ నడుమ మధ్యవర్తిగా వుంటుంది. అన్ని వరాలూ వరప్రసాదాలూ తండ్రినుండి క్రీస్తుద్వారా ఆత్మగుండా మనకు లభిస్తాయి. మన తరపున మనం దేవుణ్ణి తెలిసికోవాలన్నా చేరాలన్నా ఆత్మే మార్గం. కనుక మనం ఆత్మగుండ క్రీస్తుద్వారా తండ్రిని చేరుతాం. అసలు ఆత్మ అనుగ్రహం లేందే ఆధ్యాత్మికరంగంలో దేన్నిగూడ సాధించలేం. ఆ దివ్యవ్యక్తి దేవునికీ మనకూ మధ్య వంతెన.
2. నూత్న వేదాంతి సిమియోను అనే భక్తుడు ఈలా నుడివాడు, “ఆత్మ దేవుని నోరు, ఆ నోటితో దేవుడు పలికే పలుకే క్రీస్తు మన నోటితో మన మాటలు తెలియజేస్తాం. నోరు లేకపోతే మన మాటలు ఇతరులకు ఏలా విన్పిస్తాయి? అలాగే ఆత్మ అనే నోరు లేకపోతే క్రీస్తు మనకు విన్పించడు, కన్పించడు".

3. తిరుసభలో ఆత్మ

15. తిరుసభ ఆరంభంలో ఆత్మ

1. శ్రీసభను ప్రారంభించింది క్రీస్తు ఒక్కడే కాదు, ఆత్మకూడ. ఉత్థానక్రీస్తు శరీరం మహిమను పొందిన శరీరం. ఈ శరీరాన్నిగూర్చే అతడు “మీరు ఈ యాలయాన్ని పడగొట్టండి, నేను మళ్ళా దీన్ని మూడు దినాల్లో కడతాను" అని యూదులతో చెప్పాడు, ఇక్కడ క్రీస్తు ఉద్దేశించిన ఆలయం యెరూషలేము రాతిగుడి కాదు. తన ఉత్తాన శరీరమే - యోహా 2,19,21. కాని క్రీస్తుకి ఈ ఉత్థాన దేహంతోపాటు మరో దేహంకూడవుంది. అదే శ్రీసభ. కనుకనే పౌలు కొరింతులోని క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ "మీరందరూ