పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. క్రీస్తుని దోషినిగా నిర్ణయించినపుడు ఎవరూ అతని తరపున సాక్ష్యం చెప్పలేదు. అందరూ అతన్ని ద్రోహినిగానే ఎంచారు. ఇపుడు ఉత్తానం తర్వాత ఆత్మ క్రీస్తుని గూర్చి సాక్ష్యం పలుకుతుంది - 16,8-11. అనగా దోషిగా నిర్ణయింపబడిన క్రీస్తే నీతిమంతుడుగా చలామణి అయ్యాడు. పిశాచమే దోషిగా తీర్పును పొంద్రింది - 12,31.

3. కాని ఆత్మ క్రీస్తుకి ఏలా సాక్ష్యం పలుకుతుంది?

1. ఆత్మడు అపోస్తులుల ద్వారా క్రీస్తు మరతోత్థానాలను గూర్చి లోకానికి సాక్ష్యం చెప్పిస్తాడు = లూకా 24,48.
2. ఇంకా ఆత్మడు విశ్వాసుల హృదయాల్లో కూడ క్రీస్తుకి సాక్ష్యం పల్కుతాడు. "మీరు పవిత్రాత్మ వలన అభిషేకం పొందారు” - 1యోహా 2,20.27. ఆత్మ మన హృదయాల్లో విశ్వాసం పుట్టించి మనం క్రీస్తుని నమ్మేలా చేస్తుంది. ఈ విశ్వాసాన్నే యోహాను ఇక్కడ అభిషేకం అని పిల్చాడు. ఇది మన అంతరంగంలో జరిగే పని.

4. ఆత్మ క్రీస్తుకి ఎందుకు సాక్ష్యం పలుకుతుంది ? తాను సత్యస్వరూపియైన ఆత్మ కనుక - యోహా 16,13, నూత్నవేదం సత్యం అనే మాటను క్రీస్తుకి వాడుతుంది, ఆత్మకూ వాడుతుంది, ఆత్మ శిష్యులకు క్రీస్తుని బోధిస్తుంది. అతని బోధలను వారికి విప్పి చెప్తంది - 1426. వారిని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తుంది - 16, 13. ఈ సంపూర్ణ సత్యం క్రీస్తే. కనుక శిష్యులు ఆత్మ సహాయంతో క్రీస్తుని బాగా అర్థం చేసికొంటారు.

ఆత్మే సత్యం కాదు. క్రీస్తు సత్యం. కనుక ఆత్మ శిష్యులను సత్యంలోనికి నడిపిస్తుంది. మనకు వేదసత్యాలను తెలియజేసేది ఆత్మే అతడు ఎప్పడుకూడ మన హృదయాల్లో పని జేస్తూంటాడు. మన హృదయాల్లో దివ్యజ్యోతిని వెలిగించి మనం క్రీస్తుని అధికాధికంగా అర్థం చేసికొనేలా చేస్తుంటాడు.

ప్రార్థనా భావాలు

1. సిరియా సీమోను అనే భక్తుడు ఈలా ప్రార్థించాడు :
వెలుగైన ఆత్మమా
స్వర్ణనిధివైన ఆత్మమా
స్వీయశక్తితో సర్వాన్ని మార్చే ఆత్మమా
స్వయంగా కదలకే అన్నిటినీ కదిలించే ఆత్మమా
ఆనంద దాయకుడవైన ఆత్మమా
నా హృదయాశలకు నిలయమైన ఆత్మమా