పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా కోర్కెలన్నీ తీర్చే ఆత్మమా
నాకు ఆనందానుభూతి నొసగే ఆత్మమా
వేంచేయి.
2.ఇంకో ప్రాచీన భక్తుడు ఆత్మనుగూర్చి ఈలా జపించాడు :
కష్టపడేవాళ్ళను ఓదార్చే ఆత్మమా
మా హృదయాలను శుద్ధిచేసే ఆత్మమా
దుర్భలులకు బలాన్నొసగే ఆత్మమా
పడిపోయేవాళ్ళను నిలబెట్టే ఆత్మమా
వినయవంతుల వినయాన్ని పెంచి
గర్వితుల గర్వాన్ని అణచివేసే ఆత్మమా
అనాథులకు తండ్రివైన ఆత్మమా
పేదలకు ఆశాజ్యోతివైన ఆత్మమా
ఓడ మునిగిన వారికి రేవువైన ఆత్మమా,
నాకు నీపట్ల భక్తిని ప్రసాదించు.
3.నూత్నవేదం ప్రకారం, క్రీస్తు మరణోత్థానాలకు ముందు అతడే తండ్రినుండి ఆత్మను పొందుతాడు. ఈ దశలో అతడు శిష్యులకు ఆత్మను ఈయడు. మరణొత్ధానాల తర్వాత అతడు శిష్యులకు ఆత్మను దయచేస్తాడు. ఈ దశలో అతడు తండ్రినుండి ఆత్మను పొందడు. నేడు ఆత్మా క్రీస్తు ఒకరినొకరు మనకు అందించుకొంటారు. ఆ దివ్యవ్యక్తుల్లో ఒకరున్నచోట మరొకరుకూడ వుంటారు.

14. మరియను నడిపించిన ఆత్మ

1. మరియు తాను జన్మించినప్పటినుండి ఆత్మకు ఆలయంగా వండిపోయింది. గబ్రియేలు ఆమెను "అనుగ్రహ పరిపూర్ణురాలా" అని సంబోధించాడు. అనగా ఆమె ఆత్మతో పూర్ణంగా నిండిపోయిందనే భావం. క్రిసోస్తం భక్తుడు "తండ్రి మరియను ఎన్నుకొన్నాడు. కాని ఆత్మడు ఆమెను సందర్శించి పవిత్రపరచాడు. ఓ తోటకులాగ ఆమెకు నీరు పెట్టాడు" అని వ్రాసాడు. అనగా ఆత్మద్వారా ఆమె సంపూర్ణంగా శుద్ధినిపొంది పవిత్రురాలయిందని భావం.