పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"మిూ పాపపు పనులనుండి వైదొలగి
సత్కార్యాలకు పూనుకొనండి
న్యాయాన్ని పాటిచండి
పీడితులకు మేలు చేయండి
అనాథుల హక్కులను నిలబెట్టండి
వితంతువులను ఆదుకొనండి"

అని బోధించాడు - 1, 16-17. మిూకా ప్రవర్త

"భక్తిమంతులు భూమిమిూద కరువైపోయారు
సత్యవంతులు కలికానికైనా లేరు
ప్రతివాడూ హత్యకు పాల్పడేవాడే"

అని వాపోయాడు - 72 ఆమోసు

"నీతి ఓ నదిలాగ పొంగిపారాలి
న్యాయం ఓ జీవనదిలాగ ప్రవహించాలి"

అని శాసించాడు - 5,24.

నూతవేదంలో క్రీస్తు "ఇతరులు విూకేమి చేయాలని కోరుతారో విూరితరులకు దాన్ని చేయండి" అన్నాడు - మత్త 7,12. న్యాయమంతా, మోషే ధర్మశాస్త్రమంతా, ప్రవక్తల బోధలన్నీ ఈ యేక వాక్యంలో ఇమిడి వున్నాయి, ఇంకా ఆ ప్రభువు తోడినరుల్లో తన్ను చూచి వాళ్ళకు సాయం చేయమని చెప్పాడు. "ఈ సోదరుల్లో అత్యల్పడైన ఏ వొక్కనికి విూరు ఇవి చేసినపుడు అవి నాకే చేసారు" అని పల్మాడు - మత్త25,40.

క్రీస్తు తర్వాత అతని శిష్యులుకూడ ఆ గురువు న్యాయబోధలను కొనసాగించారు. యోహాను ఈలా వ్రాసాడు. "ఏ వ్యక్తియైన ధనికుడై యుండిగూడ అవసరంలో వున్న తన సోదరుడ్డిచూచి హృదయ ద్వారాన్ని మూసికొంటే ఇక అతని హృదయంలో దైవప్రేమ వుందని యేలా చెప్పకోగలడు? బిడ్డలారా! మన ప్రేమ కేవలం మాటలు మాత్రమే కాకూడదు, అది చేతలతో నిరూపింపబడే యథార్థ ప్రేమకావాలి" -1యోహా 3,17-18.

ఈ బైబులు బోధలను మనసులో పెట్టుకొనే నాల్గవ శతాబ్దంలో మిలాను పట్టణానికి బిషప్పగా వున్న అంబ్రోసు భక్తుడు ఈలా చెప్పాడు. "భగవంతుడు ఈ భూమిని నరులందరికోసం సృజించాడు. దాని ఫలితాన్నికూడ అందరూ అనుభవించాలనే ఉద్దేశించాడు. కాని అత్యాశవల్ల కొందరు మాత్రమే దాన్ని దక్కించుకొంటున్నారు. ఆకలితో చచ్చేవాడికి అన్నం పెట్టండి. లేకపోతే మిూరే వాణ్ణి చంపినట్లు, విూ సిరిసంపదలను పేదలకు పంచిపెట్టినపుడు విూరేమి దానధర్మాలు చేయడం లేదు. పేదలకు చెందిన వస్తువులును తిరిగి వాళ్ళకు ముట్టచెప్పతున్నారు, అంతే."