పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేదలు. కాని ప్రపంచం ఉత్పత్తిచేసే సంపదనంతటినీ కేవలం నాల్గవవంతు జనం మాత్రమే కొట్టేసి మిగతా మూడువంతుల జనానికీ ఏమి దక్కనీయడంలేదు. కనుక ఈ ధనవంతులు తమ సొత్తును పేదలతో పంచుకోవాలి.

మామూలుగా మనం అన్యాయాన్ని అట్టే లెక్కచేయం, కాని ఇది ఫరోరమైన పాపం. మడుగులో పెద్దచేప చిన్నచేపను తింటూంది. అడవిలో పెద్దమృగం చిన్నమృగాన్ని వేటాడుతుంది. అలాగే సమాజంలో బలవంతుడు దుర్బలుడ్డి, ధనవంతుడు పేదవాడ్డి, పైకులంవాడు చిన్నకులంవాణ్ణి నిరంతరం వేటాడుతూంటారు. నరుడు తోడినరునిపట్ల తోడేలులాగ ప్రవర్తిస్తూంటాడు. భగవంతునికి పోలికగావన్ననరుణ్ణి హింసిస్తే ఆ భగవంతుణ్ణి హింసించినట్లే. క్రైస్తవులమైన మనం ఈ పాపకార్యానికి పాల్పడకూడదు. కాని ఈ విషయంలో మనం ఇతర మతాలవారికంటె మెరుగేవిూ కాదు.

న్యాయం యొక్క ప్రాశస్త్యం అంతాయింతా కాదు. న్యాయాన్ని పాటిస్తేనేగాని వ్యక్తుల మధ్యనూ సమాజంలోనూ శాంతి నెలకొనదు. ఈ పుణ్యంద్వారా ఇతరుల హక్కులను మన్నిస్తాం గనుక ధర్మం నీతినిజాయితీలు నిలుస్తాయి. వంచన మోసం అంతరిస్తాయి, బలవంతులు దుర్భలులను పీడించకుండా వుంటారు. న్యాయమే లేకపోతే లోకంలో నీతి నిజాయితీలుండవు. యుద్ధాలు పెచ్చు పెరిగిపోతాయి. బలవంతుడు దుర్బరుణ అణగద్రొక్కుతాడు. అధర్మం రాజ్యం చేస్తుంది. ఇది లౌకికమైన న్యాయంయొక్క చిత్రం.

కాని క్రైస్తవ న్యాయం ఈ లౌకిక న్యాయంకంటె గొప్పది. పవిత్రాత్మ మన హృదయాల్లోనికి ప్రవేశించి వాటిని ధర్మబుద్ధితో నింపుతుంది. మనలను అన్యాయానికి దూరంగా వుంచుతుంది. మనం ఇతరుల హక్కులను మన్నించేలా, చిన్న అన్యాయాన్ని గూడ ఎంతో అసహ్యించుకొనేలా చేస్తుంది. తోడి నరులను అన్నదమ్ముల్లా, అక్కచెల్లెళ్ళలా ఆదరించీ వాళ్ళ శ్రేయస్సు కొరకు కృషిచేసేలా చేస్తుంది. ఇదే క్రైస్తవన్యాయం.

2. బైబులు దృష్టాంతాలు

పూర్వవేదంలో మోషే ధర్మశాస్త్రమూ, విశేషించి పదిఆజ్ఞలూ, న్యాయస్థాపనం కొరకు ఏర్పడినవే. ధర్మశాస్త్రంలో మోషే పలువిధాలైన న్యాయాలను పేర్కొన్నాడు. ఉదాహరణకు అతడు “వియోరు ఒకటి పెద్దది వొకటి చిన్నదిగా రెండు తూకపు రాళ్ళ వాడవదు. అలాగే వొకటి పెద్దది మరొకటి చిన్నదిగా రెండు కొలమానాలు ఉపయోగించవద్దు" అని ఆజ్ఞాపించాడు - ద్వితీ 25, 13–15. న్యాయాధిపతుల నుద్దేశించి "విూరు యూదులకుగాని విూతో వసించే విజాతీయులకుగాని జగడాలను న్యాయసమ్మతంగా పరిష్కరించాలి. ఎవరియెడల పక్షపాతం చూపవద్దు" అని శాసించాడు - 1, 16.

ప్రవక్తలు పేదలను పీడించే ధనవంతులను మొగం వాచేలా చీవాట్లు పెట్టారు. ఉదాహరణకు యెషయా