పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. పాలుమాలికవల్ల ఎన్నో శోధనలు పుట్టుకవస్తాయి. కనుకనే సీరా గ్రంథం "సోమరియైన బానిస చెడ్డపనులకు పూనుకొంటాడు" అని చెప్పంది - 33,27, సోమరిగా తిరిగే వాడికి విశేషంగా సుఖభోగాలవిూద కోరికలు పడతాయి. వాటివలన నరుని శీలం చెడుతుంది.
 3. “మంచి పండ్లనీయని ప్రతిచెట్టుని నరికి అగ్నిలో పడవేస్తారు" అన్నాడు ప్రభువు - మత్త 3,10. సోమరిపోతుకీ ఇదేగతి పడుతుంది. కనుక ఎవడి అంతస్తుకి తగినట్లుగా వాడు పనిచేయాలి. ఇక్కడ కష్టపడి పనిచేయడం చెట్టు బాగా ఫలించడం లాంటిది. పనిచేయకపోవడం చెట్టు ఫలించకపోవడం లాంటిది.
4. మనం మన పనులను చక్కగా చేసాకగూడ మేము అంత సాధించాం. ఇంత సాధించాం అని డప్పాలు కొట్టకూడదు. "మేము అయోగ్యులమైన సేవకులం, మేము మా కర్తవ్యాన్ని మాత్రం నెరవేర్చాం" అని పలకాలి - లూకా 17, 10. క్రియాపరుడే డప్పాలు కొట్టకూడదు అంటే, ఇక అసలు పని చేయనివాని గతి యేమిటి?
5. పౌలు తన జీవితాంతంలో ఈలా చెప్పకొన్నాడు. "నేను మంచి పోరాటం పోరాడాను. పందెంలో చక్కగా పరుగెత్తాను. నా విశ్వాసాన్ని నిలబెట్టుకొన్నాను. ఇప్పడు నాకు పందెం బహుమానంగా నీతిమంతుల కిరీటం లభించబోతూంది. ఒక్క నాకే గాదు, ప్రభువుకోసం వేచివున్నవాళ్ళ కందరికీ ఈ కిరీటం లభిస్తుంది - 2తిమో 4,7-8. మనం కూడ ఈ పౌలులాగ కృషిచేసి ఇతనిలాగ కిరీటాన్ని సంపాదించుకొంటే ఎంతబాగుంటుంది!
6. పనిపాటలు మానివేసి వీధులవెంట తిరిగి పోస్కోలురాయుళ్ళు తెస్సలోనిక పట్టణంలో పౌలు కంటబడ్డారు. అతడు వాళ్ళను నిశితంగా మందలించి "పనిచేయని వాడు కూడు తినడానికి అరుడు కాదు" అని శాసించాడు -2తెస్స 3,10.

4. సోమరితనాన్ని అరికట్టే మార్గాలు

సోమరిపోతులకు పనిచేయబుద్ధి కాదు. ఏదో సాకుతో పనిని తప్పించుకో జూస్తూంటారు. మనం ఈ బుద్ధిని అవశ్యం మార్చుకోవాలి. దరిద్రులూ ధనికులూ అందరూ పని చేయవలసిందే. నరుడు తన కొరకూ ఇతరుల కొరకుకూడ పనిచేయాలి. కాయలు కాయడం చెట్టు ధర్మం. అలాగే పనిచేయడం నరుని ధర్మం - లూకా 13,7. అందరూ జీవితాంతమూ శ్రద్ధతో పనిచేస్తూండవలసిందే. పనిని మానివేసిన మనిషికి విసుగు పడుతుంది. తానెందుకు జీవించాలో అర్థంకాదు. అతడు తనకు తానే భారమౌతాడు. పైగా పరాన్నభుక్కు కూడా ఔతాడు. అలాంటివాడ్డి లోకం అసహ్యించు కొంటుంది. మన కుటుంబం కూడ మనం పనిచేసి ప్రతిఫలాన్ని గడించాలనే కోరుకొంటుంది. మన కృషి వల్ల కుటుంబం బ్రతకాలి. కనుక మనం సోమరితనంగా Speyo