పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతన్ని ఆ తోటలో వుంచాడు - ఆది 2,15. భాగ్యస్థితిలో వుండికూడ అతడు పనిని ఎందుకు చేయవలసి వచ్చింది? కృషిద్వారా కాని ఆదాము పూర్ణ మానవుడు కాలేడు. అతడు దేవునిలాగ స్వయంపూరుడైన ప్రాణికాదు. పనిద్వారా కాని అతనికి పరిపూర్ణత సిద్ధించదు. ఇది నరుడు పాపం చేయకముందటి పరిస్థితి, ఆ దశలో అతనికి పని కష్టమనిపించలేదు. ఐనా అతడు పనిమాత్రం చేసితీరాలి.

ఇక పాపంచేసాక పని ఆదాముకి శిక్షగా మారింది. అతడు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపదించుకోవలసి వచ్చింది - ఆది 3,19, అతడు సేద్యంచేస్తుంటే నేల ముండ్ల తప్పలనూ గచ్చపొదలనూ మొలపిస్తూంటుంది. ఈ దశలో నరునికి పని కష్టమనిపించింది.

కనుక నరుడు పరిపూర్ణుడు కావడం కొరకూ, శిక్షగా కూడ పనిచేయాలి. కావున పని నొల్లని సోమరిపోతు రెండందాల పాపం చేసినట్లవుతుంది.

3. బైబులు దృష్టాంతాలు

1. నరుడు చీమలను చూచి ಬುದ್ಧಿ తెచ్చుకోవాలన్నాడు సాలోమోనురాజు :
“సోమరీ! చీమలను చూడు
 వాటి జీవితాన్ని చూచి బుద్ధి తెచ్చుకో
 వాటికి నాయకుడు లేడు,
 పర్యవేక్షకుడు లేడు, అధికారి లేడు
 ఐనా అవి వేసవిలో ఆహారం చేకూర్చుకొంటాయి
 కోతకాలంలో ధాన్యం సేకరించుకొంటాయి
 సోమరీ! నీవు ఎంతకాలం పండుకొనివుంటావు?
 ఎప్పడు నిద్ర మేల్కొంటావు?
 దారిద్ర్యం దోపిడికానివలె నీ విూదికి వస్తుంది
 పేదరికం ఆయుధహస్తునివలె నీమీదికి వస్తుంది"

- సామెత 6,6-11.

ఈ రాజే క్రియాపరుడు కాని నరుడ్డి యీలా వర్ణించాడు :
"బయట సింహమంది అది నన్ను వీధిలో చంపుతుంది
అని సోమరిపోతు ఇల్లు కదలడు" - సామె 22,13.
ఇంకా, బద్దకింపు మనుష్యులను గూర్చి అతడు ఈలా చెప్పాడు :
"సోమరిపోతు మూర్ణుడూ ఐన ఒకానొక నరుని
పొలం ప్రక్కగాను ద్రాక్షతోట ప్రక్కగాను నేను నడచివెళ్ళాను
ఆ పొలంనిండా మండల్లా, కలుపూ ఎదిగి వున్నాయి
దాని చుటూవున్న రాతిగోడ కూలిపోయింది"

-సామె 24,30-34