పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నీకు వడ్డించిన భోజనాన్ని మర్యాదగా భుజించు

ఆత్రంతో తిన్నావంటే అందరికీ రోత పడుతుంది
భోజనం ముగించేవారిలో నీవు మొదటివాడి వైతే
ఎంతో మర్యాదగా వుంటుంది
నీవు మితిమిూరి తింటే జనం నిన్ను మెచ్చరు
పదిమందితో కలసి భుజించేపుడు
అందరికంటె ముందుగా నీవు పదార్థాలను తీసికోవద్దు
మర్యాద తెలిసినవాడు స్వల్పంగా భుజిస్తాడు
కొద్దిగా తింటే నిద్రించేపుడు ఆయాసపడనక్కరలేదు 

మిత భోజనంవల్ల బాగా నిద్రపడుతుంది

వేకువనే వత్సాహంతో లేవవచ్చు
మితంమిూరి తింటే కడుపునొప్పి, నిద్రపట్టమి
మొదలైన అనర్గాలు దాపరిస్తాయి" - 31, 16-20.
6. నూత్నవేదాన్ని పరిశీలిస్తే, క్రీస్తు మూడు శోధనల్లో మొట్టమొదటిది తిండిపోతుతనాన్ని గూర్చే పిశాచం రాళ్ళను రొట్టెలుగా మార్చి ఆరగించమని క్రీస్తుని శోధించింది - మత్త 4,3, అలా చేస్తే అతడు దేవుని ఆజ్ఞ విూరతాడు, పిశాచం పన్నాగం ఫలిస్తుంది. కాని క్రీస్తు ఆ శోధనకు లొంగలేదు.
7. ఓ ధనవంతుడు రోజూ విందులు చేసికొని మస్తుగా భుజించేవాడు. కాని అతడు తన వాకిట పడియున్న నిరుపేద యైన లాజరుని ఎంతమాత్రం పట్టించుకొనేవాడు కాదు. ధనవంతులగుండె బండబారుతుంది అనడానికి ఇది చక్కటి నిదర్శనం - లుకా 16,19-21.
8. పేూరోదు జన్మదినోత్సవం జరుపుకొంటూ ప్రముఖులందరికీ విందు చేయించాడు. ఆ విందులో అతని వంపుడుకత్తెయైన హెరోదియా కుమార్తె నాట్యంచేయగా నీ వేమడిగినా యిస్తానని ఆమెకు పిచ్చి ప్రమాణం చేసాడు. ఆ బాలిక తల్లివలన ప్రేరేపితురాలై స్నాపక యోహాను శిరస్సుని ఇప్పించమని అడిగింది. ఈ విధంగా ఆ రాజు పుణ్యపురుషుడైన యోహాను తల కొట్టించాడు. తిని త్రాగివున్నవాళ్ళు అవివేకంతో ప్రవర్తిస్తారు — మార్కు 6,21-29.

4. భోజనప్రీతిని వారించే మార్గాలు

భోంచేసేపుడు మనకు నిర్మలమైన ఉద్దేశాలు వుండాలి. మనం తిన్నా త్రాగినా మరేంచేసినా దేవుని మహిమ కొరకే చేయాలన్నాడు పౌలు - 1కొ 10,21. జంతువులు

నోటి రుచికొరకు తిండి తింటాయి. నరులమైన మనం అలా తినకూడదు. మనం దేవుని