పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అది పెద్ద పాపం కావచ్చు. పైగా తిని త్రాగేపుడు ప్రజలు ఏవేవో గాలిసుద్దులు చెప్పకొంటూ వాళ్ళనీ వీళ్ళనీ ఆడిపోసుకొంటారు. దీనివల్ల సోదరప్రేమను భగ్నంజేసే పాపాలను మూటకట్టుకొంటారు. ఇంకా, మితంమిూరి తినేవాళ్ళు సంయమనాన్ని కోల్పోతారు. తమ్ముతాము అదుపులో పెట్టుకోలేరు. తిని త్రాగి కైపెక్కినోటికివచ్చినట్లల్లా వదరేవాళ్ళను లోకం గౌరవించదు.

3. బైబులు దృష్టాంతాలు

1. నెబుకద్నెసరు కుమారుడూ బాబిలోను ప్రభువూ ఐనా బెల్లస్సరు దుష్టరాజు. ఓమారు అతడు పెద్ద విందు చేయించాడు. అందులో ద్రాక్షాసారాయాన్ని త్రాగడానికి యెరూషలేము దేవళంనుండి కొల్లగొట్టి తెచ్చిన పవిత్రపాత్రలను వాడాడు. తాను ద్రాక్లాసవం సేవిస్తుండగానే అతనికి దైవశిక్ష ప్రాప్తించినట్లుగా తెలియజేసూ ఒక హస్తం గోడమిూద వ్రాయడం మొదలుపెట్టింది. ఆ వ్రాత సూచించినట్లుగానే అతడు తర్వాత నాశమైపోయాడు - దాని 5,1-6.

2. యిప్రాయేలీయులకు ఎడారి ప్రయాణంలో సరైన భోజనం లభించలేదు. వాళ్ళ మాటిమాటికి తాము ఐగుప్తలో తిన్న మంచి అన్నం జ్ఞప్తికి తెచ్చుకొని మోషేమిూద గొణగేవాళ్ళు, ఐగుపులో మాంసమూ చేపలూ ఉల్లిపాయలూ మస్తుగా తిన్నాం. ఈ యెడారిలో ఏవిూ దొరకడం లేదని తిరగబడేవాళ్ళ అందుకు ప్రభువు వాళ్ళను శిక్షింపవలసి వచ్చింది. - సంఖ్యా 11,Ꮞ-Ꮾ.

3. ఏసావు ఒట్టి తిండిపోతు.ఓసారి అతడు పొలంలో నుండి అలసిపోయి వచ్చి తన తమ్ముడు యాకోబు కమ్మని పులుసుచేసి వుంచుకోవడం గమనించాడు. ఆ పులుసుని తనకు వడ్డించమని అడిగాడు. యాకోబు నీ జ్యేష్ఠభాగం నాకిస్తే నా పులుసు నీకు వడ్డిస్తానన్నాడు. ఏసావు అతి తేలికగా తన జ్యేష్ఠభాగాన్ని వదలుకొని తమ్ముడి పులుసు ఆరగించాడు. అతడు అలాంటి తేలిక మనిషి ఆది 25,29-34.

4. శత్రుసైన్యాధిపతియైన హోలోఫెర్నెసు యూదియాలోని బెతూలియా పట్టణాన్ని ముట్టడించివున్నాడు. అతడు తన సైనికోద్యోగులందరికి విందు చేసాడు. యూదితుకూడ ఆ విందులో పాల్గొంది. సేనాధిపతి తప్పత్రాగి మత్తెక్కిపడకమిూద తూలివున్నాడు. అప్పడు యూదితు అతని ఖడ్గంతోనే అతని తల నరికేసింది. తమ సైన్యాధిపతి చావడం చూచి శత్రువులు చెల్లాచెదురై పోయారు - యూది 13,2–9.

5. విందుల్లో పాల్గొనేపుడు పాటించవలసిన నియమాలను గూర్చి చెప్తూ సీరా జ్ఞాన గ్రంథం ఈలా ఆదేశిస్తుంది.