పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. నీవు నీ క్రిందివాళ్ల తప్పలను కరుణతో మన్నిస్తుంటావా లేక చీటికిమాటికి వాళ్ళను తిట్టి రద్ధిచేస్తుంటావా? 6. నీవు ఆయాపనులు నీ వనుకొన్నట్లుగా జరగకపోతే సులభంగా కోపం
తెచ్చుకొంటుంటావా?
 7. నీకు కోపం వచ్చినపుడు చండాలంగా మాట్లాడి ఎదుటివాళ్ళ హృదయాన్ని నొప్పిస్తుంటావా?
8. నీవు తల్లివిగా లేక తండ్రివిగా వ్యవహరించేపుడు నీ పిల్లలమిూద విపరీతమైన కోపం చూపిస్తుంటావా?
9. కష్టాలు దురదృష్టాలు వచ్చినపుడు దేవునిమిూద విరుచుకపడి ఆ ప్రభువుని నిందించవు కదా?
10. ఒకవేళ నీవు ముక్కోపివైతే ఆ కోపాన్ని అణచుకోవడానికి ఏలాంటి ప్రయత్నం
చేస్తున్నావు?

4. భోజనప్రీతి

1. భోజనప్రీతి అంటే ఏమిటి?

మితంమిూరి తినడమూ త్రాగడమూ భోజనప్రీతి క్రిందికి వస్తాయి. చాలామందికి తిండిమిూద రంది వుంటుంది. బహుశ లోకంలో కత్తివలన చచ్చిన వారికంటె భోజనప్రీతి వలన చచ్చినవాళ్ళే యొక్కువ. పౌలు పాపాత్ములను గూర్చి చెపూ "వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు" అని వాకొన్నాడు – ఫిలి 3,9. కోరిందల్లా తినేవాళ్ళకి ఉదరమే దైవమౌతుంది.

తిండిపోతుతనం చాల విధాలుగా వుంటుంది, కొందరు ఆకలి వేయకపోయినా, అవసరం లేకపోయినా, తింటుంటారు. మరికొందరు రుచిగల పదార్థాలను ఏరికోరి తింటుంటారు. భోజనం రుచి ననుభవించడమే వీరి ధ్యేయం. ఇంకా కొందరు పొట్టనిండా భోజనం కుక్కుకొంటారు. కడుపును బస్తాలాగ నింపుకొంటారు. మరికొందరు మరికొందరు అత్యా్శతో గుంజుకొని తింటుంటారు. మృగాలు ఈలా తింటాయి. ఇవన్నీ పాడు పద్ధతులని వేరుగా చెప్పనక్కరలేదు. 

2. భోజన ప్రీతిలోని దుష్టత్వం

భోజన ప్రీతిలోని దుష్టత్వం ఇది. అది మనలను పశువులతో సమానం చేస్తుంది. మన ఆత్మ మన దేహానికి బానిస అయ్యేలా చేస్తుంది, మామూలుగా భోజనప్రీతి చావైన పాపంకాదు. కాని అతిగా తినిత్రాగడంవల్ల మన బాధ్యతలను మనం నిర్వర్తించలేనపుడూ, కాముకత్వానికి దారి తీసినపుడూ, ఉపవాస నియమాలను ఉల్లంఘించేలా చేసినపుడూ