పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనకు చేసిన చెడ్డను ఎప్పటికప్పడు మరచిపోతుండాలి. మనం ప్రస్తుతకార్యాల్లో నిమగ్నులమౌతుండాలే గాని ఈలాంటి విచారపూరితమైన ఆలోచనలతో కాలం వెళ్లబుచ్చగూడదు. ఆమాటకొస్తే, మనంమాత్రం ఇతరులకు అన్యాయాలూ అపకారాలూ చేయలేదా? ప్రభువు ఆనాడు గాలివానను శాసించగా సరస్సులోని అలలు సమసిపోయి నెమ్మది యేర్పడింది - మార్కు 4,39. మన యీ జంతుదేహం కూడ కోపంతో అలలు లేపుతూంటుంది. కాని ప్రభువు అనుగ్రహంవల్ల మన కోపాన్ని కొంతవరకైనా అణచుకోవచ్చు.

కొన్నిసారులు మనకోపం ద్వేషంగా వూరుతుంది. శత్రువు విూద పగతీర్చుకోగోరుతాం. ప్రతీకారచర్యకు పూనుకొంటాం. ఈలాంటికోపం చాల చెడ్డది. చావైన పాపం కూడ. ఏలాగైనా ప్రయత్నంచేసి ఈ రాక్షస గుణాన్ని అణచుకోవాలి. "మాయొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లే మా యప్పలను విూరు మన్నించండి" అని రోజురోజు ప్రార్ధిస్తాం - మత్త 6-12. మనం ఇతరులను మన్నించకపోతే దేవుడు మనల నేలా మన్నిస్తాడు? కనుక మనం శత్రువుని మన్నించాలి. క్రీస్తు తన విరోధులను మన్నించి మనంకూడ శత్రువులను మన్నించాలని ఉదాహరణ పూర్వంగా చూపించాడు - లూకా 23,34. కనుక మనలోని ద్వేషభావాలను అణచివేయమని మనం ఆ ప్రభువునే అడుక్కోవాలి. పైన ఉదాహరించిన సీరా వాక్యాలనుగూడ జాగ్రత్తగా మననం చేసికోవాలి. ఇంకా యీ పట్టున వేమన యీలా చెప్పాడు :

"చంపదగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు.

ఈ హిందూ ప్రవక్త బోధించిన ధర్మాన్ని క్రైస్తవులమైన మనం పాటించలేక పోయాంగదా అని సిగ్గుపడాలి.

5. ఆత్మ శోధనం

1. కొందరు తొందరపాటు మనుషులు. ప్రతిదానికీ సులభంగా కోపపడతారు. మరికొందరు నిదానంగాను శాంతంగాను వుంటూంటారు. నీమట్టకు $ð వేలాంటివాడివి?
2.కోపంవల్ల నీవు మనశ్శాంతిని కోల్పోతుంటావా?
3.నీ కోపం ద్వేషంగా మారి నీ విరోధులమిూద పగతీర్చుకొనే కాడికి పోతుందా?
4.నీవు నీకు గిట్టనివాళ్ళతో దీర్ఘకాల వైరం పెట్టుకొంటుంటావా లేక వాళ్ళను సులభంగా క్షమిస్తుంటావా?