పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. గర్వాన్ని జయించే మార్గాలు

ఈ క్రింది ఆలోచనలు అహంభావాన్ని అణచుకోవడానికి ఉపయోగపడతాయి.

1) నా గొప్ప యేమియా లేదు

నేను దేవుళ్లాగ స్వయంభువుని కాను. ప్రభువు నన్ను శూన్యం నుండి సృజించాడు. అతడు పట్టు వదలితే నేను మల్లా శూన్యంలో కలసిపోతాను. నాలోని వూపిరి అతని నుండి అరువుతెచ్చుకొన్నది. నేను దుర్భల ప్రాణిని. వ్యాధిబాధలూ జరామరణాలూ, నన్ను పీడిస్తాయి. నేను నిత్యమూ ప్రభువు విూద ఆధారపడి జీవించవలసినవాణ్ణి. ఐనా నేను అతనికి వందనాలు అర్పించను. పైగా నేనేమో మొనగాణ్ణి అన్నట్లుగా అదిరిపడుతుంటాను. నాకున్న ఆధ్యాత్మిక భాగ్యాలు కూడ దేవుడిచ్చినవే. "నీకున్నదంతా దేవుడే యిచ్చాడు. నీకున్నదంతా దేవుడి దానం కాదని నీవు గర్వించడం తగునా? -1కొ 4,7. అసలు మన పాపాలు తప్పితే మనసాంతం ఏమిూ లేదు.

2) నాయంతట నేను ఏమిూ చేయలేను

దైవ సహాయం లేకపోతే నేను ప్రాకృతిక రంగంలో కాని ఆధ్యాత్మిక రంగంలో కాని ఏవిూ చేయలేను. ఐనా నాకున్నవన్నీ నేనే కృషిచేసి సాధించాను అని విర్రవీగుతుంటాను. నా జయాలకు నేనే కారకుడను అనుకొని మిడిసిపడుతుంటాను. ఇంతకంటె గ్రుడ్డితనం ఏముంటుంది?

3) నాకు ఏలాంటి విలువ లేదు

ప్రభువు తన నెత్తురోడ్చి నన్ను రక్షించాడు. “అతడు వెలనిచ్చి మిమ్ముకొన్నాడు" - 1కొరి 6,20. క్రీస్తు మనలను రక్షించడంవల్ల మనకు విలువ వచ్చింది. చిత్రకారుడు సుందరమైన చిత్రం గీస్తే గౌరవం చిత్రకారుడికిగాని చిత్రానికిగాదు. ఐనా నేను దేవునికి గౌరవమినాయక నాకు నేనే గౌరవాన్ని ఆపాదించుకొంటుంటాను. ఇంతకంటె కృతఘ్నత ఏముంటుంది?

4) నేను పాపిని

నేను చేసిన పాపాలు ఎన్నో వున్నాయి. ఈ పాపాల ద్వారా నేను దేవునికి ద్రోహం చేసాను. కనుక ప్రభువు నన్ను శిక్షించి వుండవలసింది. అతని పక్షాన తోడినరులు నన్ను అవమానించి వుండవలసింది. ప్రకృతి శక్తులు నన్ను హింసించి వుండవలసింది. ఐనా నేను సురక్షితంగానే వున్నాను. పునీతులు వాళ్ళ పాపాలు తలంచుకొని యెంతో పశ్చాత్తాపపడ్డారు. కాని నాలో పశ్చాత్తాపభావాలు చాల తక్కువ. ఈలాంటి పాపినైన