పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేను ఏలా తలయెత్తుకొని తిరుగగలను? పైపెచ్చు భగవంతుడు నన్ను చాలపాపాలనుండి కాపాడాడు. అతని అనుగ్రహమే లేకపోతే నేను యింకా యెన్నో ఫరోరపాపా5లు చేసివుండేవాణ్ణి.

5) నేను ఇతరులను చిన్నచూపు చూడకూడదు

నేను నా కంటె తక్కువ సామర్థ్యం కలవాళ్లని చిన్నచూపు చూడ్డం తగదు. దేవుడు నాకు ఐదు సంచుల డబ్బిచ్చి ప్రక్కవాడికి రెండు సంచులే యిచ్చి వుండవచ్చు. నేను పొందిన ఐదు సంచులకు మరి ఐదు సంచుల సొమ్ము సంపాదించి దేవుడికి చూపించాలి. ఇది పెద్ద బాధ్యత. ప్రక్కవాడికి రెండు సంచుల సొమ్మే వుందని వాణ్ణి ఎగతాళి చేస్తూ కూర్చోవడం కంటె, నాబాధ్యత నేను తీర్చుకోవడం వివేకం, లేకపోతే నా మిడిసిపాటునకు దేవుడు నన్ను శిక్షిస్తాడు. అగస్టీను భక్తుడు "భగవంతుడు వినయాన్ని ప్రదర్శిస్తుంటే అల్ప మానవుడు గర్వాన్ని ప్రదర్శించడం విడట్టారం కదా!" అన్నాడు. ఈ విడూరం నాలో మాత్రం ఎంత లేదు?

6. ఆత్మ శోధనం

1. నీవు పొగరుబోతువా లేక అణకువ కలవాడివా?
2. నీవు సాహసంతో నీ శక్తికి మించిన కార్యాలు చేపట్టి నగుబాటు తెచ్చుకొంటూంటావా?
3. నీవు మాట్లాడే తీరులో డాబూ బడాయిూ కన్పిస్తుంటాయా?
4. నీ దుస్తులు, రూపం, తెలివితేటలు, కులం, మొదలైనవాటిని పురస్కరించుకొని నీవు గర్వపడుతూంటావా?
5. నీవు ఇతరుల పొగడ్డలు పొందాలని తాపత్రయ పడుతుంటావా?
6. నీవు తప్పచేసి పట్టుపడినపుడు నిజాయితీతో నీదోషాన్ని ఒప్పకొంటావా? ఇతరుల మనస్సు నొప్పించినపుడు క్షమాపణం చెప్పకొంటావా?
7. పెద్దలు నీ తప్పని తెలియజేసినపుడు నీవు వినయంతో దాన్ని అంగీకరిస్తావా?
8. నీవు ఇతరులను చిన్నచూపు చూడ్డం, విమర్శించడం, తగాదాలాడ్డం మొదలైనవి చేస్తుంటావా?
9. నీవు తోడి జనంతో మర్యాదగా మెలుగుతుంటావా లేక అమర్యాదగా ప్రవర్తించి వాళ్ళ అనిష్టానికి గురౌతుంటావా? 10. నేనితరులకంటె భక్తిమంతుణ్ణి மூ8 ఆధ్యాత్మికగర్వం నీకు లేదుకదా?