పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. హిజ్కీయా గొప్పరాజు. ఒకసారి బాబిలోనురాజు దూతలు అతన్ని చూడ్డానికి వచ్చారు. హిజ్కీయా పొంగిపోయి తన సంపదలనూ కోశాగారాన్ని వాళ్ళకు చూపించాడు. ప్రభువు అతనిమిూద కోపించి బాబిలోను ప్రజలు వచ్చి నీవు చూపించిన ఈ సొత్తంతా కొల్లగొట్టుకొని పోతారు అని యెషయాచేత ప్రవచనం చెప్పించాడు - 2రాజు 20,12-17.

5. గొల్యాతు ఫిలిస్టీయుల వీరుడు, మహాగర్వి. అతడు యిప్రాయేలీయులనూ వారు కొల్చే దేవుణ్ణి తిట్టి దావీదు మీదికి యుద్దానికి వచ్చాడు. దావీదు "నీవు కత్తి యీటె బాకు గైకొని నా విూదికి వచ్చావు. కాని నేను నీవు నిందించిన యిప్రాయేలీయుల దేవునిపేర నీ మీదికి వస్తున్నాను" అన్నాడు. దైవబలంతో అతడు గొల్యాతును గెల్చాడు -1సమూ 17,45.

6. ఉజ్జీయా తెలివైనరాజు. అతడు మారణ యంత్రాలను కనిపెట్టగా ప్రజలతన్ని పొగడారు. దానితో ఆ రాజు తలతిరిగి దేవుని పీఠంమీద సాంబ్రాణి పొగ వేయబోయాడు. ఇది యాజకులు చేయవలసిన పనికాని రాజు చేయవలసిన పనికాదు అని ఎనభైమంది యాజకులు అతనికి అడ్డం వచ్చారు. కాని అతడు అధికార మదంతో సాంబ్రాణిపొగ వేయడానికి పూనుకొన్నాడు. వెంటనే దైవ శిక్షవల్ల అతని నొసటివిూద కుష్ట పట్టుక వచ్చింది. యాజకులు అతన్ని దేవళం నుండి బయటికి గెంటివేసారు - 2దినవృ 16, 16-21.

7. మూడవ హేరోదురాజు వైభవంగా కొలువు తీర్చి ప్రజకు ఉపన్యాస మిచ్చాడు. బంటులు నీవు దేవుల్లా మాట్లాడావని అతన్ని పొగిడారు. హేరోదు ఆ పొగడ్డకు ఉబ్బిపోయి తాను నిజంగా దేవుణ్లేనని భావించాడు. ఆరాజు మిడిసిపాటునకు ఓ దేవదూత అతన్ని అక్కడికక్కడే ఘటోరంగా శిక్షించాడు. అతడు పురుగులుపడి చచ్చాడు - అచ 12,22-23.

8. ఓ పరిసయుడూ సుంకరీ దేవళానికి వెళ్లారు. సుంకరి వినయంగా ప్రభూ! ఈ పాపిని మన్నించు అని ప్రార్థించాడు. పరిసయుడు గర్వంతో "ప్రభూ! నేను ఈ సుంకరిలాగ పాపిని గాదు, నీతిమంతుణ్ణి. నీకు తెలియందేముంది?" అని ప్రార్ధించాడు. దేవుడు సుంకరి మనవిని ఆలించి పరిసయని వేడికోలును త్రోసిపుచ్చాడు - లూకా 8, 10-14.

9. 1) పొగరుబోతుతనం వినాశాన్ని తెచ్చిపెడుతుంది. మిడిసిపాటు పతనానికి దారితీస్తుంది - సామె 26,18.

2) ప్రభువు అధిపతుల్ని ఆసనంనుండి పడత్రోసి దీనులను లేవనెత్తుతాడు — లూకా 1,52.