పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21. ఆత్మ మన నాయకుడు

ఆత్మ నాయకుడై తొలినాటి సమాజాన్ని నడిపించింది. పౌలు, బర్నబా, ఫిలిప్ప మొదలైన వాళ్లంతా ఆత్మ చూపించిన మార్గంలోనే నడిచిపోయారన్నాం. పవిత్రాత్మ విశ్వాసులను నడిపించుకొని పోవడం మాత్రమే గాదు. వాళ్లకు అద్భుతమైన శక్తిని గూడ అనుగ్రహిస్తుంది - రోమా 15, 13 వాళ్లను నిత్యం ఆదుకుంటూ వుంటుంది. ఓ తల్లిలా విశ్వాసులనే బిడ్డలను ఆదరిస్తూ వుంటుంది - ఫిలిప్పి 2, 1-2 కొందరు విశ్వాసులకు వేరేవాళ్లను కుస్తరించే వరం అనుగ్రహిస్తుంది. కొరింతులో ఈలాంటి వాళ్ళు ఉండేవాళు -1 కొ 14,3.

క్రైస్తవ ప్రజలు ఈ ఆత్మకు వశులౌతూ వుండాలి. ఈ యాత్మచే నడిపింపబడుతూ వండాలి. ఈ యాత్మ అందించే ఆదుకోలును కుస్తరింపును పొందుతూండాలి. దేవుని బిడ్డలు దేవుని ఆత్మచే నడిపింపబడతారు అంటాడు - పౌలు - రోమ 8,14,

22. స్వాతంత్ర్య దాత - రోమ 8, 1-2

పూర్వవేద ప్రజలు పాపానికి, పిశాచానికి, మరణానికి, ధర్మశాస్తానికి దాసులయ్యారు. వీటన్నిటి నుండి మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తుంది ఆత్మ. ఎవరి హృదయాల్లో దేవుని ఆత్మ నెలకొని వుంటుందో వాళ్ళు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు - 2కొ 3, 17. ఈ స్వాతంత్ర్యం గూడ మరేమో కాదు, ఆత్మ అనుగ్రహించే ప్రేమశక్తే. ఈ శక్తిద్వారా మన యిష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా సంచరించం, మరి దేవుణ్ణి తోడి ప్రజలను ప్రేమిస్తాం - గల 5,13.

పరిశుద్ధాత్మ పాపాన్ని సహింపదు. పాపం చేసినపుడెల్ల స్వాతంత్ర్యాన్ని కోల్పోయి పిశాచానికి బానిసలమౌతూంటాం. కనుక మనలను పాపంలో పడిపోకుండ కాపాడుతూండాలని ఈ యాత్మను అడుక్కుందాం.

23. ప్రార్ధనం నేర్పుతుంది - రోమ 8, 26-27

ఆత్మ మన అంతరాత్మలో నెలకొనివుండి మనలో ప్రార్ధిస్తుంది. మనచే ప్రార్ధన చేయిస్తుంది. ఆత్మ సహాయంలేందే, ఏలా ప్రార్థించాలో దేనికొరకు ప్రార్ధించాలో మనకేమీ బోధపడదు. పునీతులకు ప్రార్థన నేర్పింది ఈ యాత్మ. మహాభక్తులు ప్రార్థన ద్వారా భగవంతునితో ఐక్యమయ్యేలా చేసింది ఈ యాత్మ కావున మనం ఈ యాత్మతో కలిసి ఈ యాత్మయందు ప్రార్థన చేస్తువుండాలి - ఎఫే 6, 18. 154