పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోసం ప్రార్థన చేస్తే అది ప్రార్థనాసేవ ఔతుంది. ఈ ప్రార్థనా సేవకూడ పెంతెకోస్తు సేవలో ఒక భాగమై యుండాలి.

చెలమలోని నీళ్ళు తీసూంటే ఇంకా ఊరతాయి. తీయక పోతే తెప్పకట్టి చేడిపోతాయి. ఆలాగే మనం కూడ తోడి జనులకు సేవ చేస్తూంటే ఆత్మ మన సేవా వరాలను ఇంకా అభివృద్ధి చేస్తుంది. కాని సేవ చేయకపోతే మనకు ఉన్నవరాలు కూడ త్రుప్పపట్టిపోతాయి - మత్త25, 25, 28. ఈ సత్యాన్ని గుర్తించి పెంతెకోస్తు ఉద్యమానికి చెందిన భక్తులు ఎప్పడూ ఏదోవొక రూపంలో ఎవరికో వొకరికి సేవ చేసూండాలి. ఇక ఈ సేవ, ప్రార్ధనం, భక్తసమాజం, వాక్పఠనం అనే వాటి ద్వారా మనం నాడునాటికి క్రీస్తులోకి పెరుగుతాం - ఎఫే 4, 15.

23.పరిశుద్థాత్మను పొందడానికి జపం

పరలోకంలోని తండ్రీ! నీవు యేసుక్రీస్తు ద్వారా మానవులందరికీ పాప విమోచనం కలిగించావు. ఆ క్రీస్తే మాకు రక్షకుడు ప్రభువు అని విశ్వసిస్తున్నాం. తండ్రీ! జ్ఞానస్నానం ద్వారా మమ్ము నీ బిడ్డలనుగా చేసి క్రీస్తుతో ఐక్యపరచినందులకూ, మాకు ఆత్మను ప్రసాదించినందులకూ నీకు వందనాలు అర్పిస్తున్నాం. క్రీస్తుప్రభూ! మాకు రక్షకుడవు నీవే. పిశాచ దాస్యాన్నుండీ, మా స్వార్ణాన్నుండీ మాకు విముక్తి నిచ్చేవాడవు నీవే. మా జీవితానికి యజమానుడవూ ప్రభువువూ కూడ నీవే. జీవితాంతమూ మేము నిన్నే పూజిస్తాం. నీ యాజ్ఞలకు బదులమైయుంటాం. ప్రభూ! మాకు నీ యాత్మతో జ్ఞానస్నానం దయచేయి. నీనుండి తండ్రినుండీ బయలుదేరే ఆత్మ మామీదికి దిగివచ్చునుగాక. ఆ పరిశుద్దాత్మ తన వరాలతో, ఫలాలతో, పుణ్యాలతో మా హృదయాలను నింపునుగాక. ఆ యాత్మశక్తి వలన మా నాలుకలు పట్టువదలి తండ్రి కుమారులైన మిమ్మ స్తుతించి గానము చేయునుగాక. మేము నానా భాషలలో మిమ్ము స్తుతించినుగాక. ఆయాత్మ శక్తితోనే క్రైస్తవ సమాజాన్ని ఓ భవనంలాగ నిర్మించి వృద్ధిలోకి తీసికొనివత్తముగాక. మా తరపున మేము ఆ దివ్యాత్మ చెప్పచేతలకు లోపడి వుంటామనీ, ఆ యాత్మ నడిపించినట్లల్లా నడుచుకొంటామనీ ప్రమాణం చేస్తున్నాం. క్రీస్తుప్రభూ! నీవు పరిశుద్దాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానం ఇచ్చేవాడివి. ఇప్పుడు నీ యాత్మను మామీద కుమ్మరించు. మేము నిన్ను విశ్వసించే భక్తులం. (మౌనంగా ఆత్మ దిగిరావాలని ప్రార్ధించాలి) నీవు పరిశుద్దాత్మను మాకు ప్రసాదించావని విశ్వసిస్తున్నాం. ఆ యాత్మను అనుగ్రహించినందుకు గాను నీకు వందనాలు అర్పిస్తున్నాం. ఆమెన్.