పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. మోక్షవాసులు చేసేది స్తుతిప్రార్థనే, అక్కడి భక్తులు అహోరాత్రులు ప్రభుని స్తుతించి కొనియాడుతుంటారు. వాళ్ళిలా పాడుతున్నారు - "సింహాసనాసీనునకూ, గొర్రెపిల్లకూ సదాకాలం స్తుతీ, గౌరవం, వైభవం, ప్రాభవం కలగాలి" - దర్శ 5,13. కాని మోక్షజీవితం మన యీ భూలోకజీవితంలోనే ప్రారంభమౌతుంది. మనం ఆత్మ జ్ఞానస్నానంలో క్రీస్తనీ, క్రీస్తు ఆత్మనీ, తండ్రినీ పొందాం. ఈ ముగ్గురు దైవవ్యక్తులతో ఐక్యంగావడమే మోక్షజీవితం. ఇది ఇక్కడే ప్రారంభమౌతుంది. కనుక మన యీ యిహలోక జీవితంలో కూడ స్తుతిప్రార్ధన లోపించకూడదు. మనం పెంతెకోస్తు ప్రార్థనా సమావేశాలకు హాజరైనపుడు ఉత్సాహంతో ప్రభుని స్తుతించాలి. హృదయం పులకించేలా భక్తిభావంతో కీర్తనలు పాడాలి. హృదయంలోని ఆనందం మన ముఖంలో కూడ కన్పించేలా పెద్ద యెలుగున ప్రభుని కొండాడాలి. ఇక, మనం వ్యక్తిగత జపంలో కూడ ఈ స్తుతి ప్రార్థనను విరివిగా వాడుకోవాలి. వేయేల, మనం ఎతంగా స్తుతిప్రార్థన చేస్తామో అంతగా మన హృదయం ఆనందంతో, పారవశ్యంతో, భక్తితో, సోదర ప్రేమతో నిండిపోతుంది. స్తుతి ప్రార్థనలో ఇంతటి సత్తువ వుంది.

20. పెంతెకోస్తు భక్తురాలు మరియ

1. ప్రభువు మరియకు ఓ రక్షణప్రణాళికను అప్పజెప్పాడు. ఆమె మెస్సియాకు తల్లికావాలి. కాని ప్రభువు ఆమెను నిర్బంధం చేయలేదు. మరియు స్వయంగానే ఉదారబుద్ధితో ప్రభువు ప్రణాళికను అంగీకరించింది. విశ్వాసంతో ప్రేమభావంతో తాను మెస్సియాకు తల్లి కావడానికి ఒప్పకొంది — లూకా 1,38, దీన్నిబట్టి మనం మరియను మొట్టమొదటి పెంతెకోస్తు భక్తురాలినిగా గుర్తించాలి.
ప్రభువు మనకు కూడ ఓ రక్షణ ప్రణాళికను ఇస్తాడు. ఆ ప్రణాళికను కార్యరూపేణ సాధించమని మనలను కోరుకొంటాడు. ఐనా అతడు మనలను నిర్బంధం చేయడు. అతడు మనం ఇష్టపూర్తిగా చేసే పనినిమాత్రమే చేయించుకొంటాడు. కాని, భక్తురాలు అవిలా తెరెస చెప్పినట్లు, మొదట మనలను మనం ప్రభువుకి అర్పించుకోండే అతడు తన్నుతాను మనకు అర్పించుకోడు,
2. మరియ నేను కన్యనుగదా మెస్సియాకు ఏలా తల్లినౌతానని ప్రశ్నించింది. దేవదూత ఆత్మశక్తి వలన నీవు గర్భవతి మోతావని చెప్పాడు. కాని ఈ సమాధానంతోనే ఆమె సందేహాలన్నీ తీరిపోలేదు. ఆమె ఏలా తల్లి కావాలి? శిశువు ఏలా పుడతాడు? పుట్టి ఏమౌతాడు? - ఇవన్నీ మరియను వేధించిన సమస్యలు. పైగా క్రీస్తు జీవితం కొనసాగిపోయే