పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొలదీ, యూదులు అతన్ని ఎదిరించిన కొలదీ, ఆమె సందేహాలు ఎక్కువయ్యాయి. క్రీస్తు మరణం కూడ ఆమె విశ్వాసాన్ని నిశితంగా కలచివేసింది. ఈ విధంగా మరియు జీవితకాలమంతా గూడ ఆమె విశ్వాసాన్ని పరీక్షించిచూచాడు ప్రభువు. ఐనా మరియ మహాభక్తురాలు. ప్రభువు మీదనే భారంవేసి అతన్నే నమ్మింది. ఎలిసబేత్తు మరియను కొనియాడింది విశేషంగా ఆమె నమ్మికను బట్టే - లూకా 1,45.

మన విశ్వాసజీవితంలో కూడ ఈలాంటి సందేహాలే ఎదురౌతాయి. భగవంతుడు మనలను రకరకాల రూపాల్లో పరీక్షిస్తాడు. మనలను గూర్చిన ఆ ప్రభువు ప్రణాళికలూ, ఆయన ఆత్మ మనలను నడిపించేతీరూ మనకు అర్థం కావు. ఐనా మన తరుపున మనం కష్టమైనా బాదైనా అతన్ని విశ్వసించి తీరాలి. నీతిమంతులు విశ్వాసంతో జీవిస్తారు. -రోమా 1,17,

3. మరియు దేవదూతతో నీ మాట చొప్పననే నాకు జరగాలి అంది. ఈ వాక్యం ద్వారా ఆమె దైవ ప్రణాళికను అంగీకరించింది, దైవ చిత్తానికి లోపడింది.

ప్రభువుకి లొంగిపోయి అతనికి ఆత్మార్పణం చేసికోందే మనం భక్తులం కాలేం. ఈ యాత్మార్పణం అనే గుణం ఆడవాళ్లకు సులభంగా వస్తుంది. అందుకే స్త్రీలకు బాల్యం నుండే భక్తి కుదురుతుంది. కాని మగవాళ్లకు ఆత్మార్పణం అంత సులభంగా అలవడదు. పురుషులు తాము ఈ భూమి మీద ఏవో మహత్తర కార్యాలు సాధించాలి అనుకొని భగవంతునికి లొంగిపోవడానికి ఒప్పుకోరు. ఏ వృద్ధాప్యంలోనోగాని పురుషుడు భగవంతునికి ఆత్మార్పణం చేసికోడు. అందుకే భక్తి అనేది స్త్రీలకు బాల్యంనుండే అలవడినా పురుషులకు మామూలుగా వృద్దాప్యంలోగాని అలవడదు. ఒక్క కన్యాజీవితమూ గురుజీవితమూ మాత్రమే తీసికొందాం. ఏటేట ఎందరు యువతులు భక్తి భావంతో కాన్వెంటుల్లో చేరిపోవడం లేదు! కాని యువతులతో పోల్చుకొంటే ఏటేట ఎంతమంది యువకులు సెమినరీల్లో చేరుతున్నారు?

4. మరియు భగవంతునితో తోడ్పడ్డానికి అంగీకరించగానే ఆత్మ ఆమెమీద పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె కన్యగర్భాన్ని మాతృగర్భంగా మార్చివేసింది. మరియ సాధించిందంతా పవిత్రాత్మ అనుగ్రహం వలననే సాధించింది. మనం ఓ మారు ఆత్మకు వశులమైపోగానే ఆ పవిత్రాత్మ మన జీవితంలోకూడ అద్భుతాలు చేస్తుంది. మనంతట మనం సాధించలేని మహత్తర కార్యాలను ఆయాత్మ మనకు సాధించి పెడుతుంది. ఎందుకంటే సర్వోన్నతుని శక్తి మనలనుకూడ ఆవరిస్తుంది. ఆ శక్తికి అసాధ్యమైన దేదీ లేదు - లూకా 1,35, 37. మదర్ తెరీసా, పోప్జాన్ వంటి భక్తుల చరిత్రలే ఇందుకు తార్మాణం.