పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3) దివ్యసత్రసాదం ద్వారా :

1. క్రీస్తు నెత్తటితో క్రొత్తనిబంధనం ఏర్పడుతుంది 1కొ 11,25.
 2. యాజకులైన క్రైస్తవ ప్రజలు బలి సమర్చిస్తారు - 1 పేత్రు 2,9.
 3. క్రీస్తుతోను తోడి క్రైస్తవ ప్రజలతోను ఐక్యమౌతారు - 1కొ 10, 16-17.
 4. ఆధ్యాత్మికమైన భోజనము బలమూను - యోహా 6, 53-55.

సంస్కారాలు వాటంతట అవి పై ఫలితాల్నిస్తాయి. కాని మన తరపున మనం ఈ ఫలితాల్ని పొందుతామా అనేది అనుమానం. మన హృదయం సిద్ధంగా వుండకపోవడంవల్ల ఈ ఫలితాలను పొందలేకపోతున్నాం. ఈలాంటప్పుడు పరిశుద్దాత్మ జ్ఞానస్నానం మన హృదయాన్ని శుద్ధిచేసి మనం పై ఫలితాలను పొందేలా చేస్తుంది. క్రీస్తు మన లోనికి పంపిన దివ్యాత్మఓ వైపు మనలను పితసుతులతోను, మరోవైపు తోడి క్రైస్తవ జనంతోను ఐక్యపరుస్తుంది. మనకు దైవప్రేమ సోదరప్రేమ ప్రసాదిస్తుంది.

5. కనుక పరిశుద్దాత్మ లోనికి జ్ఞానస్నానం పొందడమంటే సంగ్రహంగా :

1) ఉత్తాన క్రీస్తు తన ఆత్మను మన హృదయంలోకి ప్రవేశపెడతాడు. మనం క్రొత్తగా ఆత్మను పొందుతాం. 2) ఆత్మ మన జీవితాన్ని అదుపులో పెట్టుకొంటుంది. మనలను క్రీస్తువైపు నడిపిస్తుంది.
 3) ఆత్మ మనకు తన వరాలనూ ఫలాలనూ పుణ్యాలనూ ప్రసాదిస్తుంది.
 4) ఆత్మ దేవునిపట్లా తోడి నరులపట్లా మనకుండే సంబంధబాంధవ్యాలను చక్కదిద్దుతుంది. మన జీవితాన్నీ ఈ జీవితంలోని బాధ్యతలనూ సవరిస్తుంది.

6. ఆత్మజ్ఞానస్నానం ద్వారా మనలో ఆత్మశక్తి పెరుగుతుంది. ఇంతకుముందు మనకు మనమే నడుపుకొంటూన్న జీవితాన్ని ఇపుడు ఆత్మ నడిపించడం మొదలిడుతుంది. మన జీవితనౌకకు అతడు కర్ణధారి ఔతాడు. ఒకవేళ ఇంతకు ముందే మనం ఆత్మకు వశులమైయుంటే ఇప్పడు ఆత్మ మనలను ఇంకా తనవశంలోకి తెచ్చుకొంటుంది. పౌలు "మీరు ఆత్మతో నిండివుండండి" అని చెప్పాడు - ఎఫే 5, 18. ఈ వాక్యాన్నిబట్టి మనం మళ్ళామళ్ళా హృదయాన్ని ఆత్మతో నింపుకొంటూండాలి. ఆ యాత్మ తనతరపున తాను మనం రోజురోజుకీ వరప్రసాదంలో పెరిగేలా చేస్తుంది.

9. ఆత్మను పొందడం అంటే యేమిటి?

1. ఓ రాజకుమారుని ఓ పేద వడ్రంగి పెంచి పెద్దవాణ్ణి చేసాడు. ఆ కుర్రవాడు పెద్దవాడయ్యాక ఓదినం అకస్మాత్తుగా తాను పేదవాళ్ళ బిడ్డను కాననీ రాజకుమారుణ్ణనీ తెలిసికొన్నాడు. మనంకూడ పరలోకరాజు కుమారులం. జ్ఞానస్నానంద్వారా దేవునికి