పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాగ్దానం ప్రకారం తాను పరిశుద్దాత్మను పొంది ఆ యాత్మను శిష్యులమీదికి కుమ్మరించాడు. అచ 2, 33. యేసు ఉత్తానమైనంకనేగాని తండ్రినుండి తాను పూర్ణంగా ఆత్మను పొందడమూ, ఆలా పొందిన ఆత్మను మనకు అందీయడమూ జరగదు - యోహా 7, 39.

2. ఈలా ప్రభువు తన ఆత్మను విశ్వాసులకు ఇచ్చుకొంటూపోతూనే వుంటాడు. ఈనాడు చాలమంది భక్తులు ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందుతున్నారు. వారిలోనికి ఆత్మ నూత్నంగా ప్రవేశిస్తుంది. ఈయాత్మ ప్రవేశంవల్ల భక్తులు జీవితాలు చాలవరకు మారిపోతున్నాయి.

3. కాని ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందడమంటే యేమిటి? ఇది రెండవ జజ్ఞానస్నానంకాదు. జనస్నానం ఒక్కసారే - ఎఫే 4, 5. రెండవ భద్రమైన అభ్యంగనమూకాదు, మరి క్రొత్తగా ఆత్మను పొందడం. జ్ఞానస్నానంలో ఆత్మను పొందుతాం. కాని ఆ యాత్మడు దైవవ్యక్తి కనుక అతన్ని పూర్తిగా పొందలేం. ఇప్పుడు పరిశుద్ధాత్మ జ్ఞానస్నానం ద్వారా ఆ దైవవ్యక్తిని మళ్ళా పొందుతాం. ఈలా ఎన్నిసార్లయినా పొందవచ్చు. మన తరపున మనం ఎన్నిసార్లు ఆత్మను పొందినా ఆ దివ్యవ్యక్తిని పూర్తిగా పొందలేం. అతడు పరిమితి లేనివాడు. మనం పరిమితి కలవాళ్ళం. కుండతో ఎన్నిసార్లు ముంచుకొన్నా సముద్రంలోని నీళ్లు తరిగిపోవుగదా!

4. పరిశుద్దాత్మ జ్ఞానస్నానం ద్వారా జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగనం, దివ్యసత్రసాదం అనే మూడు క్రైస్తవ సంస్కారాలూ మనకు ఎక్కువ ఫలితమిస్తాయి, ఈ సంస్కారాలిచ్చే ఫలితాలను ఇక్కడ ఓమారు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. 1) జ్ఞానస్నానం ద్వారా :

1. క్రీస్తుతో ఐక్యమౌతాం - 1కొ 12, 17.
2. ఆత్మను పొంది మన హృదయంలో నిలుపుకొంటాం -1కొ 3,16.
3. మనకు క్రొత్తపట్టు కలుగుతుంది - తీతు 3,5.
4. పాప పరిహారం లభిస్తుంది - ఎఫే 5,26.
5. దేవునికి దత్తపుత్రుల మౌతాం - రోమా 8,15.
6. స్వార్గానికి చనిపోయి క్రీస్తు ఉత్తానంలో పాలుపొందుతాం - రోమా 6,3-4.

2) భద్రమైన అభ్యంగనం ద్వారా :

1. క్రీస్తుకి సాక్ష్యమిస్తాం - అచ 1,8.
2. క్రీస్తు శరీరమైన తిరుసభను నిర్మిస్తాం - 1కొ 12, 27.