పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తపుత్రులమయ్యాం. కాని ఈ సంగతి మనకు అట్టే తెలియదు. ఇప్పడు ఈ యాత్మను పొందడంద్వారా మనం సామాన్య జనులంగామనీ దేవుని బిడ్డలమనీ తెలిసికొంటాం. ఆత్మను పొందడమంటే ఈ తెలివిడి అలవడ్డమే.

2. ఆత్మ మనలో వుంటుంది కాని అనేక కారణాలవల్ల పని చేయదు. పొయ్యిలో నిప్పందిగాని నుసిబట్టివుంది. దాన్ని ఊదితే మళ్ళా రాజుకొంటుంది. గదిలో విద్యుచ్చక్తి వుంది గాని బల్బు వెలగడంలేదు. మీట నొక్కితే విద్యుత్తు ప్రసారమై బల్బు వెలుగుతుంది. ఇదేవిధంగా జ్ఞానస్నాన సమయం నుండే మన హృదయంలో ఆత్మ వుంటుంది గాని మన సహకారం లేకపోవడంవల్ల అట్టే పనిచేయదు. ఇప్పడు మళ్ళా ఆత్మను పొందడమంటే, ఈవరకే మన హృదయంలో వున్న ఆత్మను పనిచేసేలా చేయడం. ఏలా? ఆ యాత్మతో సహకరించడం ద్వారా.

3. ఆత్మను పొందడమంటే పరిశుద్దాత్మను మల్లా స్వీకరించడం. ఆ యాత్మ దేవుడు, మనం మనుష్య మాత్రులం. కనుక మనతరపున మనం ఆత్మను ఎన్నిసార్లు స్వీకరించినా పూర్తిగా స్వీకరించలేం. ఒక్కొక్క తడవ మనం స్వీకరించిన ఆత్మ మన జీవితాన్ని ధన్యం చేస్తూనే వుంటుంది.

4. ఆత్మను పొ్ందడమంటే పరిశుద్దాత్మ వరప్రసాదాన్ని నూత్నంగాను అధికంగాను స్వీకరించడం. ఆయాత్మ మనలోనికి విజయంచేసి మనలను క్రొత్త వ్యక్తులనుగా మారుస్తుంది. మనం క్రీస్తుకి పోలికగా వుండేలా చేస్తుంది.

5. ఆత్మను పొందడమంటే క్రొత్తగా క్రీస్తుతో నిబంధనం చేసికోవడం. "నీవు మా దేవుడవూ మేము నీ ప్రజలమూ" అని చెప్పడం. అతన్ని మనరక్షకునిగా, ప్రభువునిగా, స్నాపకునిగా అంగీకరించడం.

6. ఆత్మను పొందడంలో ముఖ్యోద్దేశం, క్రీస్తుని ప్రభునిగా అంగీకరించడం. బైబుల్లోని ప్రధానాంశం ఇదే. యేసు మన కోసం పేద నరరూపం తాల్చాడు. నీచాతినీచమైన సిలువ మీద మరణించాడు. అందుకుగాను తండ్రి అతన్ని తన సొంత బిరుదమైన "ప్రభువు" అనే పట్టంతో సత్కరించాడు, అప్పటినుండి పరలోక భూలోక పాతాళవాసులంతా ఈ క్రీస్తు ప్రభువుకి చేతులెత్తి మ్రెక్కాలి - ఫిలి 2,7-11. ఇప్పడు ఆత్మను పొందడం ద్వారా క్రీస్తు మన ప్రభువని విశ్వశిస్తాం.

కనుక పెంతెకోస్తు ఉద్యమం అంటే కేవలం పరిశుద్ధాత్మ పట్ల భక్తినిచూపడంగాదు, ఆ యాత్మ సహాయంతో క్రీస్తుని చేరడం. ఆ క్రీస్తుకి విధేయులం కావడం. మన జీవితమూ పనులూ ఆ క్రీస్తు వశం చేయడం. ఆ ప్రభువుకి మన హృదయాన్ని అర్పించుకోవడం.