పుట:Bhagira Loya.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి


గాత్రము --- మీనాక్షిబాయి

ఫిడేలు --- సీతారామయ్య

మృదంగము --- మణిఅయ్యరు

రేపు 17 - 4 - 24 తారీకున --- హాలులో 5 గంటలనుండి 8 గంటలవరకు ---


కామేశ్వరరావు పెద్దలందరకూ 3 రూపాయల టిక్కెట్లు పంపినాడు. బందరుపురమున నున్న సంగీత పండితులందరి కడకూ కామేశ్వర్రావు స్వయముగా వెళ్ళి వారి నాహ్వానించి, వారికి గౌరవపు టిక్కెట్లిచ్చినాడు.

ఊరంతా పేపర్లు పంచిపెట్టబడినవి. 17 వ తారీఖున 500 రూపాయల టిక్కెట్లమ్మబడినవి. హాలు కిటకిటలాడుతూ వున్నది. మణిఅయ్యరూ, సీతారామయ్యగారూ పక్క వాద్యాలు వాయించే ఈ ప్రతిభాశాలిని ఎవరయ్యా, అనుకుంటూనే వచ్చారు జనమంతా. సరీగా అయిదు అయ్యేటప్పటికి సీతారామయ్యగారు, మణిఅయ్యరుగారు, మీనాక్షి బాయీ వచ్చి కూర్చున్నారు. సభను చూసి మీనాక్షి గజగజలాడిపోయింది. అందాలు సుళ్లుచుడుతూ ఉమాదేవిలా వచ్చిన ఆ బాలికాదేవిని చూసి, "యీమెపాట యీమె అందానికి తగిందేనా," అని అనుకున్నారు. సభా ప్రారంభములో మీనాక్షి కొంత జంకింది. ఆనందరసవాహినియగు సీతారామయ్యగారి ఫిడేలు, లయామృతవర్షిణి యగు మణిఅయ్యరుగారి మృదంగం దివ్యంగా వినబడుతూ వున్నవి గాని మీనాక్షిగొంతుక ఎవ్వరికీ వినబడలేదు. సీతా

81