'బాపిరాజు'
రామయ్యగారు, "కళ్లు మూసుకొని పాడమ్మా" అని రహస్యంగా చెప్పారు.
మీనాక్షి కళ్లుమూసుకొని గురువుగారిని తలుచుకొని సమస్తమూ మరిచిపోయి, ఉత్కృష్టగానంతో అద్వైతరూపిణి అయింది. ఆమె కంఠము సంపూర్ణముగా వికసించిన మాలతితీగలా ఆ సభఅంతా అల్లుకుపోయింది. ప్రేక్షకులు అట్టి గొంతుక ఇదివరకు యెన్నడూ వినలేదు. అట్టి సంగీతమూ ఎప్పుడూ వినలేదు. సభ పూర్తి అయ్యేటప్పటికి సభికు లందరూ తన్మయులై ఉన్నారు.
పట్టణములోని పెద్దలూ, సంగీతవిద్వాంసులూ మీనాక్షిని పొగడుతూ ఉపన్యాసాలు ఇచ్చారు. జగద్విఖ్యాతులగు మణిఅయ్యరుగారినీ, సీతారామయ్యగారినీ గురించి చెప్పనక్కరలేదన్నారు. ఇంకో సభ ఆ పట్టణంలో చేయాలనికూడా కోరారు. ఆ వెనక రెండురోజులైన తరువాత సభలో 12 బంగారు పతకములూ, 100 రూపాయల వెండి గిన్నే మీనాక్షికి బహుమతు లిచ్చారు.
ఇదంతా చూసి వీరయ్య ఆశ్చర్యపూరితుడైపోయాడు. అలాంటి సభలూ చూడలేదు. అలాంటి పాటా వినలేదు. నీ మనవరాలు సంపాదించిందని 500 రూపాయలు తీసుకొచ్చి వీరయ్య ఒళ్ళో పోశాడు కామేశ్వరరావు. ఆరు నెలలు ఆటలాడినా వీరయ్య 200 లేనా కళ్లచూసేవాడు కాడు. కామేశ్వరరావు వచ్చిన డబ్బు మొత్తం తొమ్మిది వందల యేభై అనిన్నీ, మణి అయ్యరుగారికి రానూపోనూ
82