పుట:Bhagira Loya.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోగీరలోయ

ఉంటుందేమో, మెరుములా వచ్చి నా దగ్గిర వాలినప్పుడు అస్పష్టంగా తోచింది నా కా మూర్తి. ఆ రూపము సుందర విగ్రహమే. ఛీ! ఈ స్త్రీనామక పిశాచిని ఎందుకు తలపోసు కొంటున్నానో.

ఆమె రచించిన చిత్రాలు సవరించడం నా కా రోజుల్లో ఎంతో హేయమైన పనై వేధించింది. నేను సృష్టింప సంకల్పించిన శిల్పాలుగాని, చిత్రాలుగాని నా హృదయం లోనే ఇంకిపోయినవి. కీలుబొమ్మలా ఏదో దిద్దేవాణ్ణి, లోలోన మన్యపుజ్వరం బాధించేవాడిలా చిక్కిపోయినానట. నెమ్మదిగా చేతులకు ఒణుకు ప్రారంభిస్తుందా అన్న భయము అంకురించింది. ముప్పదిఐదేండ్లు నడుస్తూ ఉన్న నా జవ సత్వాలు నాకు దూరమైపోతున్నవి. తప్పనిసరిగా విద్యార్థులకు విద్య నేర్పడం ఎల్లాగో పెట్టుకున్నాను. తక్కిన కాలాలు మా విహారగుహలో అంతరకందరంలో ఆ కఠినశిలావేదికపై పండుకొని ఉండడమే తప్ప అడవులలోనికి విహారానికి వెళ్లలేకపోయే వాడను.

ఒకరోజున కల్హారమాల రచించిన చిత్రము సవరించ డానికి మాళవమంత్రిగారి విహారానికి పోయినాను. నేను రచించిన బోధిసత్వునిప్రక్కనే ఒక బాలికామూర్తి చిత్రాన్ని చూచినాను. ఎవరు చిత్రించినారు ఆ బొమ్మను? ఎందుకు చిత్రించినారు? నా ఆజ్ఞ లేనిదే ఏ మూర్ఖుడు చిత్రించ సాహసించాడు? ఆ విగ్రహము విస్తుపోయినట్లు నా వైపు చూస్తూ ఉన్నది : గాలి పీలుస్తున్నట్లే ఉన్నది. కొంచెము సంప్రదాయ

19