పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎల్లప్పుడు, ఉల్లసస్వభావము కలవాడుగాన, పనివాండ్రతో గలసి మెలసి బెంజమిను తిరుగుచుండెను. ఏదియో యొక క్రొత్తసంగతిని పనివాండ్రకు ప్రతిరోజున పనిలో జూపించుట వలన, వారందఱితనిని గౌరవముగ జూచుచుండిరి. ఇతనిచే శిక్షింపబడి, వారు పనిలో దేరి పారిరి. కీమరు వ్యాపారమును వారు బాగుగసాగించిరి.