పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1727 - రము ఫిబ్రవరి నెలలో, డెనుహాము - బెంజమినులు చావు సంకటముపడిరి. పార్శ్వశూలచే బెంజమిను బాధపడి, చావుకు సిద్ధమయ్యెను. "నేను విస్తారము బాధపడితిని. సర్వము విడిచితిని. రోగము కుదిరినందున ఖిన్ను డనై, లేచి తిరిగి యీ పనులనే మరల జేయవలసి వచ్చెను గదా యని విచారించితి" నని బెంజమిను వ్రాసెను. డెనుహాము చాలకాలము బాధపడి, తుదకు కాలవశమును బొందెను. తన వాత్సల్యమును జూపించుటకు, గొంతధనమును బెంజమిను కీయవలసిన దని, మరణ శాసనములో డెనుహాము వ్రాసెను. తదనంతర మతని సొత్తును సంరక్షకు లాక్రమించినందున, బెంజమిను కు లేక గాలికి తిరుగవలసివచ్చెను.

అనంతరము, కీయరుయొక్క ముద్రాక్షరశాలలో హెచ్చు వేతనమునకు బని నంగీకరించెను. ఇతనికి కీమరునకు మనస్సంతగ కలియక పోయినను, కీమరు విషయమై చెడువార్తలను వినుచున్నను, శరీరపోషణార్థ మీపనిని బెంజమిను చేయుచుండెను. ఇక్కడ పనిచేయువారలలో, న్యాయ బుద్ధిగల 'హ్యూమెరిడితు' అను నాటుపురమువాని పరిచయము బెంజమినుకు గలిగెను. వీడు వివేకి, యనుభవశాలి, లెస్సగ జదువుకొనినవాడు. అయినను, మద్యపానమును జేయువాడు; ఈ క్రొత్తపనియందు శ్రద్ధలేనివాడు.