పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెప్పించెను. విశేషముగ పనివాండ్రను నియోగించి, వ్యాపారమును వాడు సాగించుచుండెను.

వెంటనే, బెంజమిను పనిలో ప్రవేశించెను. డెనుహాము, 'వాటరు వీధి'లో నిల్లు పుచ్చుకొని, దానిని సామానుతో నింపి, దుకాణము పెట్టెను. శ్రద్ధా భక్తులతో గ్రొత్తపనిని బెంజమిను చేయుచు, కొద్దికాలములోనే వ్యాపారమునందు నేర్పరి యయ్యెను. పుత్రవాత్సల్యముతో బెంజమినుని యజమానుడు, పితృవాత్సల్యముతో యజమానిని బెంజమిను, చూచుకొనుచుండిరి. ఒక యింటిలో ఇరువురు కలిసియుండిరి. ఇటులు కాలమును సౌఖ్యముగ గడపుచున్నందున, బెంజమినుకు వర్తకయోగము తప్ప, మరియొకటి లేనట్టుతోచెను. కొద్దికాలములో నీ వ్యవహారములో వంతుదారు డగుట కవకాశము గలిగి, డెనుహాముయొక్క స్థానము నాక్రమించు నేమోయని నలుగురికి దోచెను. అన్ని విధముల తుష్టిపుష్టికలవాడైనను వెర్నను యొక్క ఋణమును తీర్చలే దనియు రీడుకన్య నన్యాయముగ దు:ఖముల పాలుచేసితి ననియు బెంజమిను విచారించుచుండెను.

మొదటిమాసములలో, పని సాగుటవలన, నితనియోగము బాగుగనుండునను యాశకలిగినను, వీనియోగదశ హఠాత్తుగ నంతరించెను. దుకాణము పెట్టిన నాలుగునెలలకు, సం||